Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్లే కాంగ్రెస్ నాశనమైందని మునుగోడు ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ తప్పుబట్టారు. వ్యక్తిగతంగా రాజకీయ నిర్ణయం తీసుకున్న రాజగోపాల్రెడ్డి టీడీపీనీ, చంద్రబాబును వివాదాల్లోకి లాగడం సరికాదన్నారు. మునుగోడు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కండువా వేసుకొని ప్రచారం చేయడంతోనే నీ గెలుపు సాధ్యమైందన్న విషయాన్ని రాజగోపాల్రెడ్డి గుర్తుంచుకోవాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన 19 ఎమ్మెల్యే సీట్లతోపాటు మూడు ఎంపీ సీట్లల్లోనూ టీడీపీ కార్యకర్తల శ్రమ ఉందన్నారు. రాజకీయ క్రీడలో భాగంగా మునుగోడు ఉప ఎన్నిక వస్తున్నదని వ్యాఖ్యానించారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.