Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అత్యంత అరుదైన జన్యు పరమైన లోపంతో బాధపడు తున్న వ్యక్తికి పేస్ హాస్పిటల్ డాక్టర్లు విజయవంతంగా కాలే య మార్పిడి శస్త్రచికిత్స చేశారు. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో ప్రధాన పెటలాజిస్ట్ డాక్టర్ గోవింద్ వర్మ మాట్లాడుతూ అలగిల్లీ సిండ్రోమ్ అనే ఈ వ్యాధి లక్ష జననాల్లో ఒకరి కన్నా తక్కువ వస్తుందని తెలిపారు ఎనిమిదేండ్ల బాలునికి చేసిన చికిత్సను వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ డాక్టర్ ఆర్ ఫణి కృష్ణ, కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ డాక్టర్ ధీరజ్ అగర్వాల్ తదితరులు పాల్గొన్నారు.