Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జలసౌధ ఎదుట ధర్నాలో వైఎస్సార్టీపీ నేత షర్మిల
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై సీబీఐ విచారణ చేయించాలని వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల డిమాండ్ చేశారు. మెఘా కృష్ణారెడ్డికి మాత్రమే సీఎం కేసీఆర్ నామినేషన్ పద్దతిలో కాంట్రాక్టులు ఇస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఆయన ఒక్కరే కాంట్రాక్టర్ ఉన్నారా ? అని ప్రశ్నించారు. ఇద్దరూ కుమ్మక్కయ్యారనీ, విలువైన ప్రజాధనాన్ని దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈవిషయమై త్వరలోనే రాష్ట్ర గవర్నర్‌ను కలవనున్నట్టు ప్రకటించారు. బుధవారం హైదరాబాద్‌లోని జలసౌద ఎదుట వందలాది మంది కార్యకర్తలతో కాళేశ్వరం అవినీతిపై ధర్నా చేశారు. మెయిన్‌గేటు ముందు బైఠాయించారు. ఆపార్టీ కార్యకర్తలు సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు, జెండా ప్రదర్శించారు. దాదాపు గంటపాటు జరిగిన ధర్నాలో షర్మిల మాట్లాడుతూ మూడేండ్లకే కాళేశ్వరం వరద ముంపుకు గురైందన్నారు, ఒకవైపు నాణ్యతలేని పనులు చేసి, మరోవైపు క్లౌడ్‌బరస్ట్ అంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. లక్ష కోట్లు ఖర్చుపెట్టి కనీసం ఒక్క ఎకరాకు కూడా నీళ్లు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే కాళేశ్వరం అద్భుతమన్న కేసీఆర్, మూడేండ్లకే ఎందుకు మునిగిందంటూ ప్రశ్నించారు. వైఎస్సార్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును రూ.35 వేల కోట్లతో ప్రణాళిక రూపొందిం చారనీ, కేసీఆర్ దాన్ని రూ.1.70 లక్షల కోట్లకు పెంచారని వ్యాఖ్యానించారు. ఇది ప్రజల ప్రాజెక్టు కాదనీ, పూర్తిగా కేసీఆర్ కమీషన్ల ప్రాజెక్టు అని విమర్శించారు. మెఘా కృష్ణారెడ్ది, కేసీఆర్ పట్టపగలే రాష్ట్రాన్ని దోచుకుంటు న్నారని వివరించారు. రెండు టీఎంసీల నీళ్లే ఎత్తింది లేదనీ, అప్పుడే మూడో టీఎంసీకి సిద్ధమయ్యారని గుర్తు చేశారు. అంతకుముందు సాగునీటి శాఖ ఇంజినీర్ ఇన్ చీఫ్ సి. ముర ళీధర్కు కాళేశ్వరంపై వినతిపత్రం సమర్పించారు. ఆయా విషయాలను ఆయనతో చర్చించారు. ఈ ధర్నాలో వెస్సార్టీపీ రాష్ట్ర నేతలు జాన్ రాఘవరెడ్డి, గట్టు రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.