Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమెరికా వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అభ్యసించే సువర్ణావకాశం
- లావణ్య, హారిక, స్వప్న, చైతన్యలను అధికారుల అభినందన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీ (టీఎస్ డబ్ల్యూఆర్ ఇఐఎస్) విద్యార్థులు చరిత్ర సృష్టించారు. టీఎస్డబ్ల్యూఆర్ఇఐఎస్లో చదువుకుంటున్న విద్యార్థినులు లావణ్య, హారిక, స్వప్న, చైతన్య అమెరికాలోని వర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ అభ్యసించే అవకాశం పొందారు. అమెరికాలోని లోవా స్టేట్ యూనివర్సిటీలో నాలుగేండ్ల అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చదువుకునే అవకాశాన్ని లావణ్య, హారిక, స్వప్న పొందగా, మరో విద్యార్థినీ చైతన్య మిల్ వాకీ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్లో డిగ్రీ చదివే అవకాశాన్ని పొందారు. వీరంతా టీఎస్ డబ్ల్యూఆర్ఇఐఎస్ ద్వారా నిర్వహించబడిన స్పాట్ క్యాంప్ ద్వారా మానిటరింగ్ చేయబడినట్టు ప్రఖ్యాత ట్రైనల్, కౌన్సిలర్ పోసాల మూర్తి, టాలెంట్ మేనేజ్ మెంట్ ప్రత్యేక అధికారి గ్రేసేనా ప్రకాష్ తెలిపారు. స్కోలస్టిక్ అప్టిట్యూట్ టెస్ట్ (ఎస్ఏటీ)లో వారంతా ట్యూషన్ ఫీ పై 75 శాతం ఉపకారవేతనం పొందారు. 'థింక్ బిగ్ అండ్ థింక్ హై' అనే నినాదంతో వరంతా టీఎస్డబ్ల్యూఆర్ఇఐఎస్లో చరిత్ర సృష్టించారని అన్నారు.
వారు అత్యుత్తమ ప్రతిభ సాధించి సహచర విద్యార్థులకు స్ఫూర్తిగా నిలవటంలో టీఎస్డబ్ల్యూఆర్ఇఐఎస్ జాయింట్ సెక్రెటరీ శారద కీలక పాత్ర పోషించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోత్సాహంతో పాటు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రోద్భలంతో, సంపూర్ణ సహకారంతో విద్యార్థులు అద్భుత ఫలితాలను సాధిస్తున్నారని వారు వివరించారు.