Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వం సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాలు అధికారికంగా నిర్వహించాలని నిర్ణయం తీసుకోవడం పట్ల కల్లుగీత కార్మిక సంఘం హర్షం ప్రకటించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్వీ రమణ బుధవారంనాడొక పత్రికా ప్రకటన విడుదల చేశారు. 20 ఏండ్ల నుంచి సంఘాల ఆధ్వర్యంలో ఆగస్టు 18వ తేదీ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నామనీ, ప్రభుత్వ ఉత్తర్వుల్లో 8వ తేదీ అని ప్రకటించారని తెలిపారు. దీన్ని సవరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి గంగుల కమలాకర్ ముఖ్యమంత్రికి పంపిన లేఖలో కూడా 18వ తేదీ అనే ఉందనీ, జీవోలో మాత్రం 8వ తేదీ అని ఉందన్నారు. ట్యాంక్ బండ్‌పై త్వరలో సర్దార్ పాపన్న విగ్రహం ప్రతిష్టించాలని కోరారు.
పాపన్న జయంతికి 10 లక్షలు కేటాయింపు
సర్దార్ సర్వాయి పాపన్న జయంతి ఉత్సవాల నిర్వహణకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ రూ.10 లక్షల నిధుల్ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 8వ తేదీ ఈ ఉత్సవాలను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. టాడీ టాపర్స్ కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఖర్చు చేయనున్నట్టు వివరించారు.
ట్యాంక్‌బండ్‌పై విగ్రహం పెట్టండి
ట్యాంక్‌బండ్‌పై సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ ఏర్పాటుకు సరైన స్థలాన్ని ఎంపిక చేయాల్సిందిగా రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి డాక్టర్ వీ శ్రీనివాస్‌గౌడ్ బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌కు లేఖ రాసారు. ఏటా ఆగస్టు 18న జయంతి, ఏప్రిల్ 2న వర్థంతి నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. విగ్రహ ఏర్పాటు స్థల ఎంపికకై అధికారుల్ని ఆదేశించాలని కోరారు.