Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెట్రోలింగ్ సమయంలో దుండగుల దాడి
నవతెలంగాణ-కంటోన్మెంట్
విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై దుండగులు అర్ధరాత్రి కత్తులతో దాడి చేశారు. హైదరాబాద్‌లోని మారేడుపల్లి ఎస్ఐ వినరుకుమార్పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 2:30 గంటల సమయంలో ఓంశాంతి హోటల్ సమీపంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ఇద్దరు వ్యక్తులు నెంబర్‌ప్లేట్ లేని స్కూటర్లపై వచ్చి ఓ అపార్టుమెంట్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్నారు. ఇది గమనించిన ఎస్ఐ వినరు కుమార్ వారి వివరాలు తెలుసుకోవడానికి ఆపారు. అందులో ఒకరు పారిపోతుండగా కానిస్టేబుల్ పట్టుకోవడానికి వెంబడించాడు. ఈ క్రమంలో మరో నిందితుడు స్క్రూ డ్రైవర్‌తో ఎస్ఐను పొత్తికడుపులో, వీపులో పొడిచి పారిపోయాడు. వెంటనే ఎస్ఐని వెంటనే స్థానిక గీతా నర్సింగ్ హోమ్‌కు తరలించారు. ఘటన విషయం తెలిసిన వెంటనే నార్త్‌జోన్ డీసీీపీ చందనా దీప్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎస్ఐని పరామర్శించారు. నార్త్‌జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు బుధవారం మధ్యాహ్నం మారెడ్‌పల్లి పోలీస్ స్టేషన్లో ఘటనా వివరాలు వెల్లడించారు.
దాడి చేసిన నిందితులు లంగర్‌హౌస్‌కు చెందిన టమాటా పవన్‌సింగ్ (వాచ్‌మెన్‌గా చేస్తుంటాడు), జవహర్‌నగర్‌కు చెందిన సంజరు సింగ్ (క్యాటరింగ్ వర్క్)గా గుర్తించినట్టు చెప్పారు. వీరు నేపాల్‌కు చెందిన వారని, బతుకుదెరువు కోసం సిటీకొచ్చి నివాసం ఉంటున్నారని, పలుచోరీ కేసుల్లో నిందితులుగా ఉన్నారని తెలిపారు. కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్టు నార్త్‌జోన్ అడిషనల్ డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు.