Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్ట్ 8 నుంచి 22 వరకు వజ్రోత్సవ వేడుకలు
- 15న రాష్ట్రమంతా జాతీయ గీతాలాపన
- 22న లాల్‌బహదూర్ స్టేడియంలో ముగింపు ఉత్సవాలు
- వజ్రోత్సవ కమిటీ చైర్మెన్ కెకె ప్రకటన
- స్వాతంత్య్ర వజ్రోత్సవ లోగో ఆవిష్కరణ
నవతెలంగాణ-కల్చరల్
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలైన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం వజ్రోత్సవాల నిర్వహణకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించిందని వజ్రోత్సవ కమిటీ చైర్మన్, రాజ్యసభ సభ్యులు కె.కేశవరావు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా స్వాతంత్య్ర స్ఫూర్తిని విస్తరించేలా ఆగస్టు 8 నుంచి 22 వరకు సాంస్కృతిక, క్రీడా, సామాజిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఇందుకు సంబంధించిన ప్రత్యేక లోగోను బుధవారం హైదరాబాద్‌లోని తెలుగు అకాడెమీలో ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కెవి.రమణ, సాహిత్య అకాడెమీ చైర్మెన్ జూలూరి గౌరీశంకర్, ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక అధికారి దేశపతి శ్రీనివాస్‌తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణకు స్వాతంత్య్రం 1948లో ఆలస్యంగా వచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఆగస్ట్ 21న శాసన సభ, మండలి కలిసి సమావేశమై తెలంగాణకు సంబంధించి తీర్మానం చేస్తుందన్నారు. గ్రామ, మండల, జిల్లా కేంద్రాల్లో పాలక వర్గాల సమావేశం జరుగుతాయని చెప్పారు. 15న ఏక కాలంలో రాష్ట్ర ప్రజలంతా ఎక్కడివారు అక్కడే జాతీయ గీతం ఆలపించేలా ఏర్పాటు చేస్తున్నామన్నారు. 22వ తేదీ ముగింపు ఉత్సవాలు లాల్ బహదూర్ స్టేడియంలో నిర్వహిస్తామని, పెద్దఎత్తున సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. ప్రముఖ సంగీత కళాకారులు జేసుదాసు లేదా ఏ.అర్.రహమాన్ సంగీత విభావరి ఏర్పాటు కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
విద్యాసంస్థలన్నింటా దేశభక్తికి సంబంధించిన అంశాలపై పాటలు, వకృత్త్వ, వ్యాస రచనా పోటీలు, 75 మంది చిత్రకారులతో చిత్ర ప్రదర్శన, డిజిటల్ విద్యుత్ కాంతులు రాష్ట్ర వ్యాప్తంగా ఉండేలా ప్రణాళిక రూపొంది చామన్నారు. సేవా కార్య్రమాల్లో రక్త దాన శిబిరాలు, నేత్ర పరీక్షలు నిర్వహించడం, స్ఫూర్తి పరుగు వంటి వాటితో పాటు పలు క్రీడలు నిర్వహిస్తామన్నారు. ప్రతి ఇంటిపైనా 15న నేత జెండాలను ఎగుర వేసేందుకు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. అటెన్ బర్రో నిర్మించిన గాంధీ చిత్రాన్ని రాష్ట్రమంతా ప్రదర్శించేలా, యువత చూసేలా ఏర్పాటు చేస్తున్నట్టు చేస్తామన్నారు. పత్రికలు, ఎలక్ట్రాని క్ మీడియా ఈ కార్యక్రమాలకు స్థలం కేటాయించి విస్తృతంగా ప్రచారం చేయాలని కోరారు. సమాచారశాఖ డైరెక్టర్ రాజమౌళి, సాధారణ పాలన శాఖ ముఖ్య కార్యదర్శి శేషాద్రి, భాషా సాంస్కృతి క శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ పాల్గొన్నారు.