Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణకు హరితహారంతోనే సాధ్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని 142 మున్సిపాల్టీల్లో అటవీశాఖ భాగస్వామ్యంతో పట్టణ హరితహారం కార్యక్రమాన్ని పురపాలక శాఖ పటిష్టంగా అమలు చేస్తున్నది. నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించి మొక్కలు నాటడం..వాటిలో 91 శాతం గ్రోత్ రేట్ ఉంది. దీనివల్ల పట్టణాలు పచ్చదనంతో శోభిల్లుతున్నాయి. ఈ మేరకు సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. సీఎం కేసీఆర్‌కి చెట్లు, ప్రకృతి, పర్యావరణ పట్ల ఉన్న మక్కువకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలలోని ప్రాంతాలను హరితక్షేత్రాలుగా అభివృద్ధి చేస్తున్నారు. పట్టణ హరితహారం అమలును రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, ఆ శాఖ ఉన్నతాదికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. దీంతో నాటిన మొక్కల్లో 91 శాతం గ్రోత్ రేటు ఉంది.
పట్టణ స్థానిక సంస్థ(యూఎల్బీ)లలో హరితహారం వివరాలు
- 142 మున్సిపాల్టీల్లోని 3618 వార్డులుండగా 1602 నర్సరీల ఏర్పాటు
- గ్రీన్ యాక్షన్ ప్లాన్ ప్రకారం 2021-22లో మున్సిపాల్టీల్లో 262.73 లక్షల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుగా.. 264.81 లక్షల మొక్కలు నాటడం జరిగింది. సక్సెస్ రేటు 100.80 శాతంగా ఉంది.
- 2022-23 లో జీహెచ్ఎంసీ మినహా 141 మున్సిపాల్టీల్లో ప్లాంటేషన్ లక్ష్యంగా 251.60 లక్షలుగా నిర్దేశించారు.
- 2022-23 కోసం నర్సరీల లక్ష్యం 280.06 లక్షలు కాగా 235.20 లక్షలు మొక్కలను పెంచారు.
- హెచ్ఎండీఏ, అటవీశాఖ, ఇతర సరఫరాదారుల నుంచి సేకరణ జరగడంతో నర్సరీల్లో ఇంకా 72.52 లక్షల మొక్కలున్నాయి.
- జూలై,2022 వరకు 72.88 లక్షల ప్లాంటేషన్ పూర్తయింది.
- 142 మున్సిపాల్టీల్లో ఇప్పటివరకు 2,290 పట్టణ ప్రకృతి వనాల(ట్రీ పార్కులు)ను అభివృద్ధి చేశారు.
- 2022-23లో అభివృద్ధి కోసం 1578 పీపీవీ, ట్రీ పార్కులను గుర్తించారు. మరో 234 పీపీవీ, ట్రీపార్కుల స్థలాలను గుర్తించాల్సి ఉంది.
- 142 మున్సిపాల్టీల్లో బృహత్ పట్టణ ప్రకృతి వనాల కోసం 141 స్థలాలు గుర్తించారు.
- 2021-22లో 77 ప్రాంతాలను అభివృద్ధి చేసి 7.76 లక్షల మొక్కలను నాటారు.
- వాటిలో 2022లో జూలై వరకు మరో 2.11 లక్షల మొక్కలను నాటారు.
142 అర్బన్ లోకల్ బాడీస్(యూఎల్)లలో మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్
- 745 స్ట్రెచ్‌లలో 1125.54 కిలోమీటర్ల రహదారి పొడవు గుర్తించారు.
- అందులో 807.78 కిలోమీటర్ల రహదారి పొడవు ప్లాంటేషన్ 512 స్ట్రెచ్‌లలో 22.92 లక్షల మొక్కలు నాటారు.
గ్రీన్ బడ్జెట్ ప్రొవిజన్
- 2020-21లో, 141 మున్సిపాల్టీల్లో రూ.251.32 కోట్లు (10 శాతం గ్రీన్ బడ్జెట్) కేటాయించబడింది. వాటిలో రూ.185.98 కోట్లు (74శాతం) వివిధ భాగాల కింద ఉపయోగించారు.
- 2021-22లో, గ్రీన్ బడ్జెట్‌కు రూ.283.72 కోట్లు (10శాతం గ్రీన్ బడ్జెట్) కేటాయించబడింది. దానిలో రూ.188.55కోట్లు వినియోగించారు.
- 2022-23లో, గ్రీన్ బడ్జెట్ కోసం రూ.263.91 కోట్లు (10శాతం గ్రీన్ బడ్జెట్) కేటాయించబడింది. దానిలో ఈ నెల రెండో తేదీ నాటికి రూ.37.46 కోట్లు వినియోగించారు.
తెలంగాణ హరిత నిధి (గ్రీన్ ఫండ్)
- హరితనిధి ట్రేడ్ లైసెన్స్‌ల నుంచి సేకరించిన మొత్తం : రూ.128.87 లక్షలు
- ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల విరాళం : రూ. 14.28 లక్షలు
- హరితనిధికి జామచేసిన మొత్తం : రూ.143.15 లక్షలు