Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి పశ్యపద్మ
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ధాన్యం కొనుగోలులో నాణ్యతా ప్రమాణాలతో ముడిపెట్టకుండా కేంద్ర ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్యపద్మ డిమాండ్ చేశారు. కేంద్రం ధాన్యం కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోకుండా ఇప్పుడు నాణ్యతా ప్రమాణాలు ఉంటేనే కొంటామంటూ చేస్తామని చెప్పటం సరైందికాదని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 2020-2021 వ సంవత్సరంలో రబీ సీజన్లో 61.87 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాల్సిన కేంద్రం ప్రభుత్వం కేవలం 28. 96 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే సేకరించిందని గుర్తు చేశారు. 9.40 కోట్ల టన్నుల ధాన్యాన్ని మట్టిపాలు చేసేందుకు కేంద్రం పూనుకుంటే ప్రజా రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. తడిచి మొలకెత్తిన ధాన్యాన్ని వేలంపాట నిర్వహించడం ద్వారా కొంతమేరకైనా నష్టాన్ని పూడ్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వంపై రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని కోరారు.