Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
- ఏర్పాట్లను పరిశీలించిన సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వతంత్ర భారత వజ్రోత్సవాల ప్రారంభ సమావేశాన్ని 8న హైదరాబాద్‌లోని హెచ్ఐసీసీలో సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి పరిశీలించారు. వారివెంట జీఏడీ కార్యదర్శి శేషాద్రి, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవింద్ర, పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా, అడిషనల్ డీజీ జితేందర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ అమరుకుమార్, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ ఎమ్డీ నర్సింహారెడ్డి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులున్నారు. ఈ సందర్బంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఈ నెల 8 నుంచి 22 వ తేదీ వరకు స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించబోతున్నట్టు తెలిపారు. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలతో సహా ఇతర ప్రజా ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. తొలుత జాతీయ పతాకావిష్కరణతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాల్లో భాగంగా 75 మంది వీణ కళాకారులచే దేశ భక్తి గీతాల వాయిద్య ప్రదర్శన, స్వతంత్ర సమర యోధులను తలుచుకునే శాస్త్రీయ నృత్య ప్రదర్శన, ఫుజన్ డాన్స్ కార్యక్రమాలుంటాయని తెలిపారు. ప్రారంభోత్సవానికి ఆహ్వానితులకు ప్రత్యేక ఇన్విటేషన్లు పంపిస్తున్నామని చెప్పారు.