Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం కోమటిపల్లి సర్పంచ్‌పై అత్యాచార ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ వాకాటి సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ ఘటన చాలా బాధాకరమని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని జిల్లా ఎస్పీ, కలెక్టర్‌ను కోరారు. ఘటనపై వెంటనే సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆమె ఆదేశించారు.