Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం విజయనగరం గ్రామానికి చెందిన ఉదరుకి మంకీ పాక్స్ లక్షణాలు ఉన్నాయని శుక్రవారం వైద్యులు తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్లో బీటెక్ అగ్రికల్చర్ చదువుతున్న ఉదరు.. పది రోజుల కిందట స్వస్థలం విజయ నగరం వచ్చాడు. కాగా, ఉదరుకి జ్వరంతో పాటు చేతులు, కాళ్లకు దద్దుర్లు రావడంతో మణుగూరు ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్లగా అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించారు. మరికొన్ని వైద్య పరీక్షల నిమిత్తం కొత్తగూడెం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్ళమని సూచించారు. జిల్లా ఆస్పత్రి వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహించిన అనంతరం సాధారణ స్కిన్ ఇన్ఫెక్షన్ అని మూడు రోజులు హోం ఐసోలేషన్లో ఉండాలని వైద్యులు సూచించారని ఉదరు తెలియజేశారు.