Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాజ్‌భవన్ వైపునకు వెళ్లే ప్రయత్నం...
- నాయకుల అరెస్టు... ఉత్రిక్తత
- బీజేపీ నుంచి దేశాన్ని రక్షించుకోవాలి
- ఇందిరాపార్కు ధర్నాలో మల్లు భట్టి విక్రమార్క పిలుపు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
బహుళజాతి సంస్థలకు కొమ్ముకాస్తూ...దేశ వినాశనానికి పాల్పడుతున్న బీజేపీ పరిపాలన నుంచి ప్రజలను కాపాడాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. దేశ రక్షణ కోసం స్వాతంత్ర సంగ్రామ స్ఫూర్తితో మరోసారి ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన తమ పార్టీ అనేక సంస్థలను, వ్యవస్థలను, ఆస్తులను ఏర్పాటు చేసి నవభారత నిర్మాణం చేసిందన్నారు. కాంగ్రెస్ సృష్టించిన సంపదను బీజేపీ కొల్లగొడుతుంటే స్వాతంత్రం తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మౌనంగా ఉందామా? కండ్ల ముందే బీజేపీ ఆస్తులను అమ్మేస్తుంటే తెగించి కొట్లాడుదామా? ఒక్కసారి ఆలోచించాలంటూ కార్యకర్తలను కోరారు. నిత్యావసర ధరలు, బీజేపీ సర్కారు విధానాలను నిరసిస్తూ...శుక్రవారం కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలు రాజ్‌భవన్ వైపునకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, ఈ క్రమంలో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట, జగిరింది. ఉద్రిక్తత నెలకొంది. నాయకులను అరెస్టు చేసి నారాయణగూడ స్టేషన్‌కు తరలించారు. ధర్నా ముగింపు సందర్భంగా భట్టి మాట్లాడుతూ నిత్యావసర వస్తువుల ధరలు రికార్టు స్థాయికి చేరుకోవడం బాధాకరమన్నారు. పాల ఉత్పత్తులపై జీఎస్టీ, అడ్డగోలుగా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంపు, విపరీతమైన నిరుద్యోగం, అగ్నిపత్ పేరుతో సైనికులను అవమాన పరచడం వంటి చర్యలకు బీజేపీ పాల్పడుతున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు వరదలతో తీవ్రంగా నష్టపోయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజానీకంపై పన్నులు వేసి మధ్యతరగతి కుటుంబాలు బతకలేని దుస్థితిని తెచ్చిందని విమర్శించారు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ...ఈడీ,ఐటీ, సీబీఐలను ఉసిగొల్పి అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించే ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. ఆజాదికా అమత్ ఉత్సవాల పేరిట జెండా పండుగ చేస్తూ ప్రజా సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నదని చెప్పారు. ఆనాడు కాంగ్రెస్ చేసిన స్వాతంత్ర సంగ్రామ పోరాట ఫలితమే నేడు జరుపుకుంటున్న 75 సంవత్సరాల ఆజాద్ అమత్ మహౌత్సవాలని గుర్తు చేశారు. ధర్నాలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్‌కుమార్ యాదవ్, మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సీతక్క, ఏఐసీసీ కార్యదర్శులు బోసు రాజు, నదీమ్ జవీద్, రోహిత్ చౌదరి, మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావ్, మైనార్టీ సెల్ చైర్మెన్ సోహెల్, రోహిన్ రెడ్డి, బెల్లయ్య నాయక్ తదితరులు పాల్గొన్నారుసీనియర్ నాయకులు చిన్నారెడ్డి, మల్లు రవి, అనిల్ కుమార్ యాదవ్, మెట్టు సాయికుమార్, కత్తి కార్తీక,కుమార్‌రావు తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్‌లో ఇంటిపార్టీ విలీనం
- పార్టీలో చేరిన చెరుకు సుధాకర్
- కండువా కప్పిన మల్లిఖార్జున ఖర్గే
తెలంగాణ ఇంటిపార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎనుముల రేవంత్‌రెడ్డి సమక్షంలో తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు చెరుకు సుధాకర్ శుక్రవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తమ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేసినట్టు ప్రకటించారు. ఆ పార్టీ నాయ కులు సోమయ్య, సందీప్ చమార్, కాంగ్రెస్ నాయకుడు సత్తు మల్లేష్ తదితరులు చేరారు.