Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ ఘన విజయం
- అధ్యక్షుడిగా చుక్క రాములు ఎన్నిక
నవతెలంగాణ-సిటీబ్యూరో/కాప్రా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాచారం పారిశ్రా మిక ప్రాంతంలోని యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపెనీలో యూనియన్ ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్(సీఐటీయూ) ఘన విజయం సాధిం చింది. శనివారం హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్ టైగర్ గుర్తు దూసుకు పోయింది. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాము లు యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ కంపెనీ ఎంప్లా యీస్ యూనియన్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తన సమీప హెచ్ఎంఎస్ అభ్యర్థి మందా సదానందం గౌడ్‌పై 23 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా ఎండీ అబ్దుల్లా(101 ఓట్లు), వర్కింగ్ ప్రెసిడెంట్‌గా వి.వెంకట్ నారాయణరెడ్డి(99 ఓట్లు), చీఫ్ వైస్ ప్రెసిడెంట్‌గా రాజు.కె(104 ఓట్లు), ఉపాధ్యక్షులుగా కె.శ్రీకాంత్ (102ఓట్లు), ఎం.తిరు పతి రెడ్డి (95 ఓట్లు), డిప్యూటీ జనరల్ సెక్రటరీగా రాము.ఆర్ (102 ఓట్లు), జాయింట్ సెక్రటరీలుగా కె.శ్రీనివాస్ రెడ్డి(98 ఓట్లు), ఎన్.బాలకృష్ణ (109ఓట్లు), ఆర్గనైజింగ్ సెక్రటరీలుగా ఎన్.రాజ్ కుమార్ (108 ఓట్లు), ఎస్.సంతోష్‌కుమార్(106 ఓట్లు), సహాయ కోశాధికారిగా గ్యార నాగరాజు(104 ఓట్లు) గెలుపొందారు.
చుక్క రాములుకు అభినందనలు
యునైటెడ్ స్పిరిట్స్ లిమిటెడ్ యూనియన్ ఎన్నికల్లో హెచ్‌ఎంఎస్‌పై 23 ఓట్ల మెజారిటీతో గెలుపొందిన సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములుకు విజయోత్సవ అభినందనలు తెలియజే స్తున్నట్టు చర్లపల్లి ఇండిస్టియల్ ఎంప్లాయీస్ యూనియన్ ఒక ప్రకటనలో పేర్కొన్నది.