Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యుత్ సవరణ బిల్లు ప్రతుల్ని తగులబెట్టిన ఉద్యోగులు
- విద్యుత్ సంస్థల ఎదుట మెరుపు ఆందోళనలు
- కేంద్రం బిల్లును ఉపసంహరించు కోవాలని డిమాండ్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పార్లమెంటులో విద్యుత్ సవరణ బిల్లును ప్రవేశపెట్టాలనే కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం (8వ తేదీ) రాష్ట్రంలోని అన్ని విద్యుత్ సంస్థల ఉద్యోగులు విధులు బహిష్కకరించాలని తెలంగాణ స్టేట్ పవర్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఎస్పీఈజేఏసీ) పిలుపునిచ్చింది. ఈ మేరకు 8వ తేదీ ఉదయం 6 గంటల నుంచే విద్యుత్ ఉద్యోగులు విధులు బహిష్కరిస్తారని తెలిపింది. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే దేశవ్యాప్తంగా 27 లక్షల మంది ఉద్యోగులు, కార్మికులు నిరవధిక సమ్మెలోకి వెళ్లిపోతామని హెచ్చరించింది. ఈ విషయాన్ని నేషనల్ కో ఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ అండ్ ఇంజినీర్స్ (ఎన్సీసీఓఈఈఈ) ఇప్పటికే కేంద్రప్రభుత్వానికి నివేదించిందని తెలిపారు. టీఎస్పీఈజేఏసీ ఆధ్వర్యంలో శనివారంనాడిక్కడి దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) ఎదుట విద్యుత్ ఉద్యోగులు మెరుపు ఆందోళనకు దిగారు. కేంద్రప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యుత్ సవరణ బిల్లు-2022ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ బిల్లు ప్రతులను తగులబెట్టారు. ఎవరితో చర్చించకుండా, యావత్ విద్యుత్ సంస్థలు, వాటి ఆస్తులను ప్రయి వేటుకు కట్టబెట్టేందుకు ప్రధాని నరేంద్రమోడీ ప్రయ త్నిస్తున్నారని విమర్శించారు. ఈ బిల్లును సోమ వారం పార్లమెంటులో ప్రవేశపెట్టాలని నిర్ణయించార న్నారు.ఈ చర్యల్ని ప్రజాఉద్యమాలతో తప్పకుండా అడ్డుకుంటామన్నారు. కేంద్రం దేశంలోని అన్ని ప్రభుత్వరంగ సంస్థల్ని కార్పొరేట్లకు అమ్మకానికి పెట్టిందని విమర్శించారు. నిరసనల్లో టీఎస్పీఈ జేఏసీ చైర్మెన్ జీ సాయిబాబు(1104), కన్వీనర్ పీ రత్నాకరరావు(టీఎస్‌పీఈఏ), కో చైర్మెన్ ఈ శ్రీధర్ (327), కో కన్వీనర్ పీ బీసిరెడ్డి (టీపీడీఈఏ), వైస్ చైర్మెన్లు ఎమ్ అనిల్‌కుమార్ (టీఎస్ఈఏఈఏ), ఎమ్ఏ వజీర్ (1535), జాయింట్ సెక్రటరీలు వీ గోవర్థన్, వీ కుమారచారి (టీఎస్‌యూఈఈయూ -సీఐటీయూ), ఎమ్ తులసి నాగరాణి (ఈడబ్ల్యూ డబ్ల్యూఏ), డీ శ్యాంమనోహర్ (టీఎస్ఈఎస్సీ అండ్ ఎస్టీ ఈడబ్ల్యూఏ), ఎమ్ వెంకన్నగౌడ్ (టీఈబీసీఈ డబ్ల్యూఏ), ఆర్ సుధాకర్‌రెడ్డి (టీఈఓసీఈడబ్ల్యూఏ) తదితరులు పాల్గొన్నారు.