Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఐటీయూ తీర్మానం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం సోమవారం విద్యుత్ సవరణ చట్టం 2022ను లోక్సభలో ప్రవేశపెడుతున్నదని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ పేర్కొంది. రైతు సంఘాలు, విపక్షాలు, విద్యుత్ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం పెట్టినా కార్పొరేటు సంస్థల ప్రయోజనాల కోసం మోడీ ప్రభుత్వం పార్లమెంటులో ఈ బిల్లును ప్రవేశపెడుతున్నదని విమర్శించింది. అది ఆమోదం పొందితే విద్యుత్ రంగం పూర్తిగా ప్రయివేటుపరం అవుతుందని పేర్కొంది. శనివారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో రెండురోజులపాటు కొనసాగుతున్న సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాల్లో ఇదే అంశాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానం ఆమోదించింది. కేంద్రం విద్యుత్ రంగాన్ని అదాని, అంబానీ, టాటా వంటి బడా కార్పొరేట్ల పరమవుతుందని ఆందోళన వ్యక్తం చేసింది. జనరేషన్, ట్రాన్స్మిషన్, డిస్ట్రబ్యుషన్ల ప్రయివేటీకరణతో వినియోగదారులపై భారంపడుతున్నదని పేర్కొంది. ఉద్యోగ భద్రత ప్రమాదంలో పడుతుందని ఆందోళన వ్యక్తం చే సింది. ఈ నేపథ్యంలో అఖిల భారత స్థాయిలో ఇంజనీర్లు, ఉద్యోగ సంఘాలు సంయుక్తంగా ఎన్సీసీవోఈఈఈ ఆధ్వర్యంలో ఆగస్టు 8న 'వర్క్ బారుకట్'కు పిలుపునిచ్చిందని గుర్తు చేసింది. ఈ పోరాటానికి సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. విద్యుత్ ఉద్యోగుల సర్క్కిల్స్, టీిఎస్ఎన్పీడీసీఎల్, టీిఎస్ఎస్పీడీసీఎల్, విద్యుత్ సౌదలో భారీ ఎత్తున జరగనున్న ఆందోళనలో సీఐటీయూ శ్రేణులు పాల్గొని సంఘీభావం తెలపాలంటూ తీర్మానించింది. కేంద్ర బీజేపీ సర్కారు ప్రజావ్యతిరేక ఈ బిల్లును ఉపసంహరించుకోకుంటే కార్మిక సంఘాలు కూడా పెద్దఎత్తున ఉద్యమమిస్తారని తెలిపింది. సీిఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం హెచ్చరించింది.