Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతీయ జెండాతో భారీ ర్యాలీ
నవతెలంగాణ- కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
కరీంనగర్ జిల్లా కేంద్రంలో గురువారం అంబేద్కర్ చౌరస్తా నుంచి ఆర్ట్స్ కాలేజీ ఆవరణలోని జాతీయ పతాకం వరకు ఈ ప్రీడమ్ రన్ సాగింది. పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ త్రివర్ణపతాకంతో ముందుకు సాగగా.. ఈ రన్లో వేలాదిగా కరీంనగర్ వాసులు భాగస్వాము లయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడారు. ప్రపంచ దేశాలు ఈర్ష్య పడే విధంగా వజ్రోత్సవ వేడుకలు నిర్వహించుకుం దామని పిలుపునిచ్చారు. 'పోరాడితే పోయేదే ముంది... ప్రాణం తప్ప' అంటూ ఎందరో మహనీ యులు స్వాతంత్య్రం కోసం అమరులయ్యారని వివరించారు. గాంధీలాంటి యోధులు అహింసా మార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తీసుకొచ్చారని, సీఎం కేసీఆర్ సైతం అదే మార్గంలో ఉద్యమించి తెలంగాణను తీసుకొచ్చారని చెప్పారు. స్వరాష్ట్ర ఫలాలు ఇప్పుడిప్పుడే ప్రతి తెలంగాణ బిడ్డకూ అందుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మొక్క నాటి సంరక్షించాలని, పర్యావరణాన్ని భావితరాలకు అందించాలని కోరారు. ఇదే సందర్భంగా తలసేమియా రోగులకు అండగా నిలిచేందుకు విరివిగా రక్తదాన శిబిరాలు చేపట్టాలని సూచిం చారు. ఈనెల 16న చేపట్టబోయే 'ఏకకాలంలో సామూహిక జాతీయ గీతాలాపన'ను విజయవంతం చేయాలని కోరారు. 15న ప్రతి ఇంటిపైనా జాతీయ జెండాను రెపరెపలాడించాలన్నారు. చివరగా జనగణమన జాతీయ గీతాలపనతో 'ఫ్రీడమ్ రన్'ను ముగించారు.