Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాగర్ 26 క్రస్ట్ గేట్ల ఎత్తి నీటి విడుదల
నవతెలంగాణ-నాగార్జున సాగర్
కృష్ణమ్మ ప్రవాహంతో నాగార్జునసాగర్ నిండుకుండలా మారింది. శ్రీశైలం క్రస్ట్ గేట్ల నుంచి 4,22,761 క్యూసెక్కుల వరద పోటెత్తుతుండటంతో గురువారం ఎన్నెస్పీ అధికారులు నాగార్జునసాగర్ జలాశయం 26 క్రస్ట్ గేట్లను ఎత్తి 3,80,016 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 590 అడుగులు కాగా ప్రస్తుతం 588.00 అడుగుల వద్ద 306.1010 టీఎంసీల నీరు నిల్వ ఉంది. జలాశయం నుంచి ప్రధాన జల విద్యుత్ కేంద్రం ద్వారా 30,206 క్యూసెక్కులు, ఎడమకాల్వకు 5292, కుడికాల్వకు 4547, ఎస్ఎల్బీసీకి 2400, వరద కాల్వకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్ రిజర్వాయర్ నుంచి మొత్తం 3,80,016 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నది. లోతట్టు ప్రాంతాల వారు అప్రమత్తంగా ఉండాలని ప్రాజెక్టు, రెవెన్యూ అధికారులు సూచించారు. సిబ్బందిని అప్రమత్తం చేశారు. కాగా, సాగర్ 26 గేట్లను ఒకే రోజూ ఒకేసారి ఎత్తడం చరిత్రలో తొలిసారి కావడం విశేషం.