Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 18 నుంచి గ్రాండ్ నర్సరీ మేళా
- ఐదు రోజుల పాటు నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజాలో ప్రదర్శన
- బ్రోచర్ ఆవిష్కరణలో మంత్రి హరీశ్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మనం నేడు మొక్కలు నాటడమంటే రాబోయే భవిష్యత్ తరాలకు ఆక్సిజన్ అందించడమేనని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో 12వ గ్రాండ్ నర్సరీమేళా బ్రోచర్‌ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో గల పీపుల్స్ ప్లాజాలో ఆలిండియా హార్టికల్చర్, అగ్రికల్చర్ షో, నర్సరీమేళా ఈ నెల 18 నుంచి ప్రారంభమై ఐదురోజుల పాటు కొనసాగుతుందని చెప్పారు. షోలో మొక్కల ఉత్పత్తులు, పండ్లు, కూరగాయల తోటలు, ఎరువులు, ఆర్గానిక్ ఉత్పత్తులు, అగ్రికల్చర్ ఎనర్జీ సేవింగ్ టెక్నాలజీ, అగ్రికల్చర్ సైన్స్, ఎడ్యుకేషన్, ఫుడ్ ఇండిస్టీ ఉత్పత్తులు ప్రదర్శిస్తారని తెలిపారు. టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్, హైడ్రోఫోనిక్ సిస్టమ్ వంటి నూతన టెక్నాలజీ ఈ షోలో ప్రదర్శించనున్నారని పేర్కొన్నారు. గ్రాండ్ నర్సరీ మేళా ఇన్చార్జి ఖలీద్ అహ్మద్ మాట్లాడుతూ.. దేశ నలుమూలల నుంచి వచ్చేవారు 120కు పైగా నర్సరీ స్టాల్స్ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. 50 రూపాయల నుంచి రూ.3 లక్షల వరకు విలువైన మెడిసినల్ ప్లాంట్స్ కిచెన్, అవుట్ డోర్, ఎక్సోటిక్ టిక్, బల్బ్, సీడ్, సీడ్ లింక్స్, ఇండోర్, ఆడినియం, బోన్సారు, క్రీపర్స్, ఫ్లవర్స్, ఇంపోర్టెడ్ ప్లాంట్స్ అందుబాటులో ఉంటాయని వివరించారు. మేళాను మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, హార్టికల్చర్ కమిషనర్ వెంకట్రామ్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు.