Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంజినీరింగ్‌లో 80.41
- అగ్రికల్చర్లో 88.34 శాతం ఉత్తీర్ణత
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
తెలంగాణ ఎంసెట్ ఫలితాల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు సత్తా చాటారు. ఇంజినీరింగ్, అగ్రికల్చర్ విభాగాల్లో తొలి పది ర్యాంకుల్లో ఒకటి,రెండు మినహా మిగిలినవన్నీ వారే కైవసం చేసుకున్నారు. ఎంసెట్ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం కూకట్‌పల్లిలోని జేఎన్టీయూలో విడుదల చేశారు. ఇంజినీరింగ్‌కు 1,56,860 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 1,26,480 మంది అర్హత సాధించారు. అగ్రికల్చర్, మెడికల్‌కు 80,575 మంది పరీక్ష రాయగా 71,180 మంది అర్హత సాధించారు. ఇంజినీరింగ్ విభాగంలో ప్రకాశం జిల్లాకు చెందిన పోలు లక్ష్మిసాయి లోహిత్ రెడ్డి మొదటి ర్యాంకు సాధించారు. నక్కా సాయి దీప్తిక ( ఖాండ్యం గ్రామం, శ్రీకాకుళం జిల్లా) రెండో ర్యాంకు, పొలిశెట్టి కార్తికేయ ( ఖాజీపేట గ్రామం, గుంటూరు జిల్లా) మూడో ర్యాంకు, పల్లి జలజాక్షి ( కాకారపల్లి గ్రామం, శ్రీకాకుళం జిల్లా) నాలుగో ర్యాంకు, మెండ హిమవంశి ( బలగ, శ్రీకాకుళం జిల్లా) ఐదో ర్యాంకు, గండు హరిదీప్ (అమలాపురం తూర్పు గోదావరి జిల్లా) ఆరో ర్యాంకు, డి.జాన్ జోసెప్ (సీతమ్మధార, విశాఖపట్నం) ఏడో ర్యాంకు, పెనికలపాటి రవికిషోర్ ( గుంటూరు) ఎనిమిదో ర్యాంకు, గవినికడి అరవింద్ (నాగర్ కర్నూల్, తెలంగాణ) తొమ్మిదో ర్యాంకు, నందన్ మంజునాథ్ ఇమ్మడిశెట్టి (హైదరాబాద్) పదో ర్యాంకు సాధించారు.
అగ్రికల్చర్, మెడికల్ విభాగంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన జుటూరి నేహ మొదటి ర్యాంకు సాధించారు. వంటకు రోహిత్ (విశాఖపట్నం) రెండో ర్యాంకు, కల్లం తరుణ్‌కుమార్ రెడ్డి (గుంటూరు) మూడో ర్యాంకు, కొత్తపల్లి మహీత్ అంజన్ (హైదరాబాద్) నాలుగో ర్యాంకు, గుంటుపల్లి శ్రీరామ్ (గుంటూరు) ఐదో ర్యాంకు, మువ్వ నివేదిత (విజయవాడ) ఆరో ర్యాంకు, మింటశివ తేజస్విని (కర్నూలు) ఏడో ర్యాంకు, విఎస్వి శ్రీశశాంక్ గోపిశెట్టి (హైదరాబాద్) ఎనిమిదో ర్యాంకు, ప్రణీత్ గంజి హైదరాబాద్) తొమ్మిదో ర్యాంకు, వజ్రాల దినేష్ కార్తిక్ రెడ్డి (గుంటూరు) పదో ర్యాంకు సాధించారు.
కౌన్సెలింగ్ షెడ్యూల్
- ఈనెల 21 నుంచి 29 వరకు ఆన్లైన్ స్లాట్ బుకింగ్
- 23 నుంచి 30 వరకు ధ్రువపత్రాల పరిశీలన
- 23 నుంచి సెప్టెంబరు 2 వరకు వెబ్ ఆప్షన్లు
- సెప్టెంబరు 6న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్ల కేటాయింపు
- సెప్టెంబరు 28, 29న రెండో విడత స్లాట్ బుకింగ్
- సెప్టెంబరు 30న రెండో విడత ధ్రువపత్రాల పరిశీలన
- సెప్టెంబరు 28 నుంచి అక్టోబరు 1 వరకు వెబ్ ఆప్షన్లు
- అక్టోబరు 4న రెండో విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
- అక్టోబరు 11 నుంచి తుది విడత కౌన్సెలింగ్
- అక్టోబరు 13న తుది విడత ధ్రువపత్రాల పరిశీలన
- అక్టోబరు 11 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు
- అక్టోబరు 17న తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
- 20న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు జారీ