Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సికింద్రాబాద్-పూణే మధ్య ప్రారంభం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కోవిడ్ టైంలో నిలిపివేసిన (ట్రైన్ నెంబర్లు 12026/12025) సికింద్రాబాద్-పూణే-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆగస్టు 10 నుంచి రెండు వైపులా పునరుద్ధరించినట్టు దక్షిణ మధ్య రైల్వే శువ్రకారంనాడొక పత్రికా ప్రకటనలో తెలిపింది. ఈ రైలులో కొత్తగా చేర్చిన విస్టా డోమ్ కోచ్‌కు ప్రయాణీకుల నుంచి మంచి ఆదరణ లభిస్తున్నదని పేర్కొన్నారు. దక్షిణ మధ్య రైల్వేలో విస్టాడోమ్ కోచ్‌తో నడిచే మొట్టమొదటి రైలు ఇదే కావడం గమనార్హం. పెద్ద పెద్ద గాజు కిటికీలు ఉండే ఈ కోచ్‌లో, పైకప్పు కూడా గాజుతో చేసిందే కావడం విశేషం. ఈ కోచ్‌లో ప్రయాణం చేసేటప్పుడు ప్రయాణీకులు తమ చుట్టూ ఉన్న పరిసరాలు, కొండలు, లోయలను చూస్తూ వెళ్లడం ధ్రిల్లింగ్‌గా ఉంటుంది. అడవుల మీదుగా వెళ్తున్నప్పుడు ప్రకతి అందాలు రమణీయంగా కనిపిస్తాయి. ఈ కోచ్‌లో పెద్ద పెద్ద గాజు కిటికీలతో పాటు ఎల్ఈడీ లైట్లు, వెనక్కి జారిగిల పడుతూ, చుట్టూ తిరిగే పుష్బ్యాక్, రొటేటల్ సీట్లు, విద్యుత్‌తో పక్కకు జరిగే కంపార్ట్మెంట్ తలుపులు వంటి అనేక ప్రత్యేకతలు ఉన్నట్టు తెలిపారు.ప్రయాణ మార్గంలో ఈ రైళ్లు రెండువైపులా బేగంపేట్, వికారాబాద్, తాండూర్, వాడి, కలబుర్గి, సోలాపూర్ రైల్వేస్టేషన్లలో ఆగుతాయి. ఈ కోచ్‌లో ప్రయాణానికి ఒక్కొక్కరికి రూ. 2110 చార్జి వసూలు చేస్తారు. క్యాటరింగ్ సౌకర్యానికి ప్రతి ఒక్కరు అదనంగా రూ. 385 చెల్లించాల్సి ఉంటుంది.