Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఘనంగా ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యావిధానానికి వ్యతిరేకంగా సమరశీల పోరాటాలు చేస్తామని అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్) రాష్ట్ర అధ్యక్షులు ఎన్ఏ స్టాలిన్ అన్నారు. ప్రభుత్వ విద్య పరిరక్షణ ఉద్యమాల్లో అందరూ కలిసి రావాలని కోరారు. ఏఐఎస్ఎఫ్ 87వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు హైదరాబాద్ హిమాయత్ నగర్ అమృతా ఎస్టేట్స్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్వేత అరుణపతాకాన్ని ఆయన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. భారతదేశ స్వాతంత్య్రం కోసం 1936 ఆగస్టు 12న ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో అఖిల భారత విద్యార్ధి సమాఖ్య (ఎఐఎస్ఎఫ్) ఆవిర్భావించినట్టు తెలిపారు. ఆ సమయంలో అనేకమంది విద్యార్థీ యువకిషోరాలు స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేస్తూ, నివాళులు అర్పించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమాలే ఊపిరిగా సంఘ కార్యకలాపాలు నడుస్తున్నాయని చెప్తూ, పలు చారిత్రక ఉదాహరణలు తెలిపారు. అసమానతలతో కూడిన నూతన జాతీయ విద్యా విధానాన్ని రద్దు చేసేవరకు నిరంతర పోరాటాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్ఎన్ శంకర్, ఉపాధ్యక్షులు పుట్ట లక్ష్మణ్, రాష్ట్ర నాయకులు మర్రి శ్రీమాన్, గ్యార క్రాంతి, పీ శివ, కాసోజ్ నాగజ్యోతి, రెహమాన్, ఎండీ అన్వర్, పి. వినోద్, హరీష్, నర్సింహా, డి.క్రాంతి, వినరు, నరేష్, రాజు, మహేష్ పాల్గొన్నారు.