Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాఖీలు కట్టిన అక్కలకు సీఎం పాదాభివందనం
- కేటీఆర్కు ఎమ్మెల్సీ కవిత రాఖీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ముఖ్యమంత్రి కేసీఆర్ అధికార నివాసమైన హైదరాబాద్లోని ప్రగతి భవన్లో రాఖీ పండుగ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. కేసీఆర్కు ఆయన సోదరీమణులు రాఖీ కట్టారు. అక్కాచెల్లెళ్లు కలిసి ఆయనకు హారతి పట్టి, రాఖీలు కట్టి, మిఠాయిలు తినిపించి ఆశీర్వదించారు. సీఎం మనవడు, మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు సోదరి అలేఖ్య రాఖీ కట్టింది. ఈ రాఖీ వేడుకల్లో సీఎం సతీమణి శోభ, మంత్రి కేటీఆర్ శైలిమ దంపతులు తదితరులు పాల్గొన్నారు. రాఖీ పండుగ సందర్భంగా తనకు రాఖీలు కట్టిన అక్కలకు సీఎం కేసిఆర్ పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకున్నారు.తమ సోదరుడిని వారు నిండు మనసుతో ఆశీర్వదించారు. ఎమ్మెల్సీ కవిత తన సోదరుడు రాష్ట్ర మంత్రి కేటీఆర్కు రాఖీ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.