Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి
- వరద బాధితులకు న్యాయం చేయాలి
- రణదీక్షలో టీజేఎస్ అధ్యక్షులు కోదండరామ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కమీషన్ల కోసమే కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ను మార్పులు చేసిందని తెలంగాణ జనసమితి (టీజేఎస్) అధ్యక్షులు కోదండరామ్ విమర్శించారు. ఆ ప్రాజెక్టులో జరిగిన అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. 'కాళేశ్వరం ప్రాజెక్టు-భారీ డిజైన్ లోపాలు, అవినీతి- ముంచెత్తిన వరద బీభత్సం-సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి'అని కోరుతూ శనివారం హైదరాబాద్‌లోని నాంపల్లిలోని ఆ పార్టీ కార్యాలయంలో కోదండరామ్ రణదీక్షను చేపట్టారు. ఈ దీక్షను న్యాయవాది చంద్రశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కోదండరామ్ మాట్లాడుతూ భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రాంతాలను అధికారులతో సర్వే చేసి బాదితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టులో మునిగిపోయిన పంపుహౌజ్‌ల నష్టాన్ని కాంట్రాక్టు చేపట్టిన కంపెనీ భరించాలని కోరారు. ప్రాజెక్టు కట్టకముందే ఎన్నో సార్లు డిజైన్ మార్చొద్దంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. స్వరాజ్య వేదిక నాయకులు కన్నెగంటి రవి, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అంబాటి నాగయ్య కోదండరామ్‌కు నిమ్మరసం ఇచ్చి విరమించారు. ఈ దీక్షకు రిటైర్డ్ ఇంజినీర్లు లక్ష్మినారాయణ, వెంకట్ రమణ, టీడీఎఫ్ నేత గోపాల్‌రెడ్డి, నాయకులు కరుణాకర్ రెడ్డి దేశాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్ రవిబాబు పిట్టల, రిటైర్డ్ ప్రొఫెసర్ వినరుబాబు, సింగరేణి నాయకులు నీరటీ రాజన్న, దేవి సత్యం తదితరులు సంఘీభావం ప్రకటించారు, ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు పిఎల్ విశ్వేశ్వర్ రావు, గంగాపురం వెంకట్‌రెడ్డి, గోపగాని శంకర్రావు, నిజ్జన రమేష్ ముదిరాజ్, మొగుడంపల్లి ఆశప్ప, రాజా మల్లయ్య, మోహన్‌రెడ్డి, శ్రీధర్, పల్లె వినరు కుమార్, గీతాంజలి, పుష్పనీల, భద్రగమ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.