Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రేపు సీఎంకు వెయ్యి మంది కళాకారులతో స్వాగతం
- పూర్తి రిహార్సల్స్‌ను పరిశీలించిన సీఎస్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశ స్వాతంత్య్ర దినోత్సవం, వజ్రోత్సవ వేడుకల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం చారిత్రక గోల్కొండ కోటలో జాతీయ జెండాను ఎగరేయనున్నారు. ముఖ్యమంత్రి కోటకు చేరుకునే సమయంలో ఉదయం 10.30 గంటలకు వెయ్యి మంది జానపద కళాకారులు ఆయన ఘన స్వాగతం పలకనున్నారు. సంబంధిత పూర్తి రిహార్సల్స్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
గోల్కొండ కోటలో జాతీయ పతాకావిష్కరణ అనంతరం సీఎంకు పోలీస్ దళాలు రాష్ట్రీయ సెల్యూట్‌ను చేయనున్నాయి. ఈ కార్యక్రమానికి హాజరయ్యే వారికి ప్రత్యేక పాసులు జారీ చేసినట్టు సమాచార పౌర సంబంధాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. మొత్తం కార్యక్రమాన్ని వీక్షించటానికి వీలుగా కోట లోపలా, బయటా ప్రత్యేకంగా భారీ తెరలను ఏర్పాటు చేశారు. మంచినీటి సౌకర్యంతోపాటు వర్షం పడినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు వాటర్ ప్రూఫ్ టెంట్లను ఏర్పాటు చేశారు.