Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వాలు ప్రజలకిచ్చిన హామీని అమలు చేయాలి
- కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తున్న బీజేపీ :
రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీపీఐ(ఎం) సీనియర్ నాయకులు పి మధు
నవ తెలంగాణ- పాన్‌గల్
మతోన్మాదం నుంచి దేశాన్ని రక్షించుకుందామని రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, సీపీఐ(ఎం) ఆంధ్రప్రదేశ్ సీనియర్ నాయకులు పి మధు, ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు లక్ష్మి అన్నారు. వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం నర్సాయిపల్లిలో సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో ఆపార్టీ సీనియర్ నాయకులు నాగిరెడ్డి తల్లి రాములమ్మ సంస్మరణ సభను ఆదివారం నిర్వహించారు. ముందుగా రాములమ్మ చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీజేపీ మతోన్మాదాన్ని రెచ్చగొట్టి దేశాన్ని చీలిక చేసి కార్పొరేటు శక్తులను ప్రోత్సహిస్తుందని తెలిపారు. బీజేపీ పాలనలో ప్రభుత్వ రంగాన్ని ప్రయివేటీకరణ చేసి ప్రజల మీద భారం మోపుతుందన్నారు. అంతేకాకుండా నిత్యావసర ధరలు పెంచి ప్రజలపై భారాలు వేస్తుందని విమర్శించారు. మతోన్మాదాన్ని ఎదుర్కొని ప్రజలను రక్షించాలని పిలుపుని చ్చారు. రాబోయే కాలంలో సీపీఐ(ఎం) బలోపేతం చేసి ప్రజా ఉద్యమాన్ని నిర్వహించాలని తెలిపారు. రాములమ్మ ఆశయాల సాధన కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి జబ్బర్, సీనియర్ నాయకులు ఆర్. రామ్‌రెడ్డి, భాస్కర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు బాల్య నాయక్, బొల్లారం గ్రామ కార్యదర్శి కృష్ణ, పీఎన్ఎం జిల్లా నాయకులు వెంకటస్వామి,ఆంజనేయులు, శివ పాల్గొన్నారు.