Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమర్
హైదరాబాద్: 75 ఏండ్లు గడుస్తున్నా దళితులు వెనుకబడిన కులాలు వారు అభివద్ధి చెందకపోవడం దురదష్టకరమని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ అన్నారు. ఆదివారం మల్కాజ్ గిరి నియోజకవర్గంలోనిఆనంద్ బాగ్ చౌరస్తా లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ?ఏండ్లు గడుస్తున్నా కలలుగన్న విధంగా సమాజంలోని ఇతర వర్గాలతో సమానంగా ఎస్సీ, ఎస్టీలు అభివద్ధి చెందలేదన్నారు దళితులు ఆదివాసులు ఎస్టీలు వెనుకబడిన కులాల వారి కోసం వచ్చేనెల 17వ తేదీ నుంచి 100 ఉన్నతమైన కంపెనీల ద్వారా జాబ్ మేళా నిర్వహిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, హరిప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.