Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి :
భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలను పురస్కరించుకొని విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభను కనబర్చిన 14 మంది రాష్ట్ర పోలీసు అధికారులకు రాష్ట్రపతి పోలీసు పతకాలను కేంద్ర ం ఆదివారం ప్రకటించింది. ఇందులో ఇద్దరు అధికారులకు రాష్ట్రపతి పోలీసు పతకాలు (పీపీఎం), 12 మందికి ఇండియన్ పోలీసు మెడల్ (ఐపీఎం) లు లభించాయి. రాష్ట్రపతి పోలీసు పతకాలు పొందిన వారిలో రాచకొండ పోలీసు కమిషనర్ మహేశ్ మురళీధర్ భగవత్, రాష్ట్ర కౌంటర్ ఇంటిలిజెన్స్ ఎస్పీ దేవేందర్ సింగ్‌లు ఉన్నారు. అలాగే, ఇండియన్ పోలీసు మెడల్స్ పొందిన వారిలో హైదరాబాద్ కమిషనరేట్‌లో పని చేస్తున్న నగర అదనపు పోలీసు కమిషనర్ (క్రైమ్స్ అండ్ సిట్) అమినేని రామచంద్ర శ్రీనివాస్, అదనపు ఎస్పీ (క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్) పాలేరు సత్యనారాయణ, ఎస్ఐబీ అదనపు ఎస్పీ పైల్లా శ్రీనివాస్, సెంట్రల్ జోన్ ఏసీపీగా ఉన్న సాయిని శ్రీనివాస్ రెడ్డి, ఏసీబీ ఖమ్మం రేంజీ డీఎస్పీ వెంకటరమణమూర్తి, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ డీఎస్పీ చెరుకు వాసుదేవరెడ్డి, తెలంగాణ పోలీసు అకాడెమీ డీఎస్పీ (సివిల్) గురు రాఘవేంద్ర, రామగుండం సీఎస్బీ ఎస్ఐ రాజమౌళి, రాచకొండ కమిషనరేట్ చౌటుప్పల్ స్పెషల్ బ్రాంచ్ ఏఎస్సై కాట్రగడ్డ శ్రీనివాసు, కామారెడ్డి హెడ్ క్వార్టర్స్‌లో ఏఆర్ ఎస్సై నీలం రెడ్డి, వరంగల్ టీఎస్ఎస్పీ ఫోర్త్ బెటాలియన్ ఏఆర్ ఎస్ఐ సాలేంద్ర సుధాకర్, కరీంనగర్ ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ ఉండింటి శ్రీనివాస్ లు ఉన్నారు.