Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అబిడ్స్‌లో ఉదయం 11.30 గంటలకు పాల్గొననున్న సీఎం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించబోయే జాతీయ గీతాలాపనలో సీఎం కేసీఆర్ పాల్గొనున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్‌లోని అబిడ్స్ జీపీవో వద్ద ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సోమవారం పరిశీలించారు. అబిడ్స్‌తోపాటు సామూహిక జాతీయ గీతాలాపనకు జనం భారీ సంఖ్యలో హాజరయ్యే ప్రాంతాలైన నెక్లెస్ రోడ్, వాటర్ ఫ్రంట్ కూడలి తదితర ప్రాంతాల్లోని ఏర్పాట్లను కూడా ఆయన పరిశీలించారు. జిల్లాలతోపాటు హైదరాబాద్‌లోని అన్ని ప్రధాన కూడళ్లలో సామూహిక జాతీయ గీతాలపన చేయటానికి వీలుగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధుల చిత్ర పటాలు ప్రదర్శించాలనీ, రంగురంగుల బ్యానర్లు, మైకులను ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులు పలు కళాశాలకు చెందిన విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొనేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని ఆయన ఆదేశించారు. ట్రాఫిక్ నిబంధనలు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.