Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) పరిధిలో పంపిణీ వ్యవస్థ పటిష్టత కోసం గడచిన 8 ఏండ్లలో రూ.13,129 కోట్లు వ్యయం చేసినట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి తెలిపారు. 75వ స్వాతంత్య్రదినోత్సవ వేడుకలను మింట్ కాంపౌండ్‌లోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆయన జాతీయపతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. రాష్ట్రంలో గరిష్ట విద్యుత్ డిమాండ్ 14,160 మెగావాట్లకు చేరిందని తెలిపారు. పంపిణి నష్టాలను 9.14 శాతానికి తగ్గించామనీ, రెవెన్యూ వసూళ్లు 98.39 శాతానికి పెంచామని వివరించారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు టి శ్రీనివాస్, కే రాములు, జి పర్వతం, సీహెచ్ మదన్ మోహన్‌రావు, ఎస్ స్వామిరెడ్డి, పీ నరసింహారావు, జి గోపాల్, సీవీఓ కే మురళీధర్‌రావు పాల్గొన్నారు.
ఎన్పీడీసీఎల్లో...
ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎన్పీడీసీఎల్) పరిధిలో పంపిణీ వ్యవస్థ పటిష్టత కోసం గడచిన 8 ఏండ్లలో రూ.5,911 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఆ సంస్థ సీఎమ్‌డీ ఏ గోపాలరావు తెలిపారు. సోమవారంనాడాయన వరంగల్‌లోని సంస్థ ప్రధాన కార్యాలయంలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, మాట్లాడారు. 8 ఏండ్లలో విద్యుత్ పంపిణీ సాంకేతిక నష్టాలను 11.71 శాతం నుంచి 8.76 శాతానికి తగ్గించామన్నారు. కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు బీ వెంకటేశ్వరరావు, పీ గణపతి, పి సంధ్యారాణి, పి మోహన్‌రెడ్డి, వీ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ సౌధలో...
రాష్ట్రంలో విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల బలోపేతానికి రూ.36,918 కోట్లు ఖర్చు చేసినట్టు టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు తెలిపారు. సోమవారం విద్యుత్ సౌధలో జరిగిన 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్క రించి, మాట్లాడారు. రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి 23న 14,160 మెగావాట్ల అత్యధిక డిమాండ్ నమోదైందని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని రంగాలకు 24 గంటల విద్యుత్ సరఫరాను నిరంతరాయంగా ఇస్తున్నామని అన్నారు. 2014తో పోలిస్తే రాష్ట్రంలో విద్యుత్ తలసరి వినియోగం జాతీయ సగటుకంటే 73 శాతం పెరిగిందన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్రవ్యాప్తంగా చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో టీఎస్ ట్రాన్స్‌కో డైరెక్టర్లు జీ నర్సింగరావు, టీ జగత్‌రెడ్డి, జే సూర్యప్రకాష్, బీ నర్సింగరావు, టీఎస్జెన్కో డైరెక్టర్లు టీఆర్కే రావు, సీహెచ్ వెంకటరాజం, ఎమ్ సచ్చిదానందం, ఎస్ అశోక్‌కుమార్, బీ లక్ష్మయ్య, ఏ అజరు పాల్గొన్నారు.