Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నష్టం రూ.500 కోట్లు
- దెబ్బతిన్న 1753 కిలోమీటర్ల రహదారులు
- 71 ప్రాంతాల్లో కోత
- 257 చోట్ల రాకపోకలు బంద్
- సర్కారుకు ఆర్అండ్బీ నివేదిక
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన వర్షాలకు రోడ్లు భారీగా ధ్వంసమయ్యాయి. రోడ్లు, భవనాల శాఖకు చెందిన వేలాది కిలోమీటర్ల మేర రోడ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. జులైలో పడ్డ వానలకు తీవ్రస్థాయిలో ఆయా జిల్లాల్లో వరద లొచ్చిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో అన్ని జిల్లాల్లో రోడ్లు కోతకు గురి కావడం, కోట్టుకుపోవడం జరిగింది. అలాగే బ్రిడ్జిలు, కల్వర్టులు సైతం మరమ్మతులకు గురయ్యాయి. మొత్తం రాష్ట్రవ్యాప్తంగా 27,461 కిలోమీటర్ల రోడ్ల విస్తీర్ణానికిగాను 1753 కిలోమీటర్ల రోడ్లు పూర్తిగా వరదలకు దెబ్బ తిన్నాయి. 257 ప్రాంతాల్లో రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. 71 చోట్ల రహదారులు కోతకు గురయ్యాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వానికి, రోడ్లు, భవనాల శాఖ ఇటీవల నివేదిక సమర్పించింది. వరదల కారణంగా దాదాపు రూ.500 కోట్ల మేర నష్టంచోటుచేసుకున్నట్టు అందులో ఉన్నతాధికా రులు పేర్కొన్నారు. కొత్తగా రోడ్లు వేయడం, దెబ్బతిన్నవాటికి మరమ్మతులు చేయడం, కోతకు గురైన వాటిని పునరుద్ధరించడం తదితర పనులు చేయా ల్సి ఉంటుందని ప్రభుత్వానికి నివేదిక ద్వారా తెలియజేశారు. ఇదిలా వుండ గా ఆ నివేదికలో ఆర్అండ్బీ ఉన్నతాధికారులు నష్టాన్ని చాలా తక్కువగా చూపించారనే విమర్శలు వస్తున్నాయి. క్షేత్రస్థాయి నుంచి నష్టం అంచనాలను సరిగ్గా తెప్పించలేదనే ఆరోపణలూ ఉన్నాయి. క్షేత్రస్థాయి అధికారులు దెబ్బ తిన్న రోడ్ల వివరాలను ఇంకా పూర్తిగా పంపలేదని సమాచారం. గత నెల మూడో వారం వరకు అందిన సమాచారంతోనే ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ ఒక నివేదికను ముఖ్యమంత్రికి పంపారు. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు దాదాపు రూ. 1000 నుంచి రూ. 1300 కోట్ల మేర నష్టం జరిగి నట్టు అనధికారిక సమాచారం. రాష్ట్రంలోని పశ్చమ ప్రాంతం, తూర్పు ప్రాంత ంలో అధికంగా రోడ్లు దెబ్బతిన్నట్టు సమాచారం. కేంద్రం నుంచి ఇటీవల వచ్చి న పరిశీలక బృందాలు ఆయా జిల్లాల్లో పర్యటించాయి. నిజామాబాద్, ఆదిలా బాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాకు ఒక బృందం, ములుగు, భూపాలపల్లి, కొత్త గూడెం, భద్రాచలం జిల్లాకు మరో బృందం వెళ్లాయి. ఖానాపూర్- మంచిర్యా లలోని ఒక బ్రిడ్జి 200 మీటర్ల మేర కోతకు గురైంది. భద్రాచలం -చర్ల- వెంకటపూర్ గ్రామాల మధ్య రోడ్డు దాదాపు 26 కిలో మీటర్ల మేర నీట మునిగింది. ఇక్కడ రోజుల తరబడి పూర్తిగా రాకపోకలు లేకుండాపోయాయి. స్థానికంగా ఆర్టీసీ బస్సులతోపాటు ప్రయివేటు వాహనాలు తిరగడానికి కూడా వీలుకాలేదు. తీవ్ర అంతరాయం కలిగింది. స్థానిక రవాణా వ్యవస్థ పూర్తిస్థా యిలో దెబ్బతింది. కొన్ని జిల్లాల్లో రోడ్లకు తాత్కాలికం గా మరమ్మతులు చేస్తున్నారు. మరికొన్ని జిల్లాల్లో దెబ్బతిన్న రోడ్లను పునరుద్ధ రించాలంటే నాలుగైదు నెలల సమయం పట్టే అవకాశం ఉంటుందని సమా చారం. ఈమేరకు రోడ్ల పునరుద్ధరణ పనులను వేగంగా పూర్తిచేసేందుకు ఆర్అండ్బీ ప్రయత్నాలు చేస్తున్నది. ఈ విషయమై ఆర్అండ్బీ ఇంజినీర్ ఇన్ చీఫ్ పి.రవీందర్రావును సంప్రదించే ప్రయత్నం చేయగా, అందుబాటులో లేరు.