Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఫలించిన జేఏసీ పోరాటాలు, చర్చలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సివిల్ సప్లరు, జీసీసీ హమాలీ కార్మికులకు ఎగుమతి, దిగుమతి నూతన రేట్ల పెంపునకు రాష్ట్ర సర్కారు అంగీకారం తెలిపింది. దీంతో ఎనిమిది నెలలుగా తెలంగాణ సివిల్ సప్లరు, జీసీసీ హమాలీ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటాలు, అధికారులతో చర్చలు ఫలించినట్టయింది. మంగళవారం హైదరాబాద్‌లోని సివిల్ సప్లరు కార్పొరేషన్ ప్రధాన కార్యాలయంలో హమాలీ కార్మిక సంఘాల ప్రతినిధులకు, యాజమాన్యానికి చర్చలు జరిగాయి. ఈ సందర్భంగా హమాలీ, కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్లపై సామరస్యంగా కమిషనర్ న్చందించారు. ప్రస్తుతమున్న రూ. 22ను రూ.26కి పెంచుతామని కమిషనర్ ప్రతిపాదించారు. ప్రస్తుతమున్న ధరల దనుగుణంగా రూ.30 ఇవ్వాలని కార్మిక సంఘాల నేతలు పట్టుబట్టారు. ఇరువురు సూత్రపాయంగా రూ.27కి అంగీకరించారు.
ప్రస్తుతం ఇస్తున్న రూ.5, వేల బోనస్‌ను, రూ.7 వేలుగా, దసర పండుగ సందర్భంగా హమాలీలకు ఇస్తున్న స్వీట్ బాక్సులకు రూ.700 నుంచి రూ. 800లుగా, మహిళా స్వీపర్లకు గోదాముల సామర్ధ్యాన్ని బట్టి ప్రస్తుతమున్న వేతనాలపైన వెయ్యి రూపాయలు చొప్పున పెంచింది. వీటితోపాటు రెండు జతల యూనిఫాం టైలరింగ్ చార్టీలకు రూ.1000 నుంచి 1,300కి పెంచారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న గోనే సంచుల బ్లేడ్లు, ఘట్టాలకు ప్రస్తుతం ఉన్న రూ.25ని లను కేంద్ర ప్రభుత్వం ఎఫ్‌సీఐ అధికారులతో చర్చించి పెంచుతామనీ, హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తామని హామీనిచ్చారు. బుధవారం ఇన్సూరెన్స్ పాలసీ సంస్థలతో చర్చలు జరిపి పాలసీ వర్తింపజేసే ప్రయత్నం చేస్తామన్నారు. గిరిజన కార్పొరేషన్ గోదాముల్లో పనిచేసే హమాలీలకు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తామని భరోసానిచ్చారు. హమాలీ కార్మికులందరికీ గుర్తింపు కార్డులిస్తామని చెప్పారు. ఈ చర్చల్లో హమాలీ వర్కర్లు, సివిల్ సప్లరు హమాలీల సంఘాలకు చెందిన పాలడుగు సుధాకర్(సీఐటీయూ హమాలీ విభాగం రాష్ట్ర కార్యదర్శి), కె.బాలయ్య( సివిల్ సప్లరు హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు -సీఐటీయూ), బి.మొగిలి( జీసీసీ హమాలీ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు), ఎస్.బాలరాజు(ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు), శ్రీనివాస్, రామయ్య(టీఆర్ఎస్కేవీ), కిరణ్ (ఐఎఫ్టీయూ రాష్ట్ర కార్యదర్శి) ఓమేశ్వర్(ఏఐటీయూసీ), తదితరులు పాల్గొన్నారు.