Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆయన సేవలు చిరస్థాయిగా నిలుస్తాయి
- టీఎస్‌ఈఈఎఫ్ ప్రతినిధుల ప్రశంస
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు రాష్ట్ర విద్యుత్ రంగానికి చేస్తున్న సేవలు చిరస్థాయిగా నిలిచిపోతాయని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఫోరం (టీఎస్‌ఈఈఎఫ్) ప్రతినిధులు కొనియాడారు. మంగళవారం విద్యుత్ సౌధలో సామూహిక జాతీయ గీతాలాపన అనంతరం ఫోరం ప్రతినిధులు హెచ్ మల్లేశం, ఈ శ్రీనివాస్, పి సురేష్‌బాబు,పీ ప్రేమ్‌కుమార్, చక్రవర్తి, విజరు, కృష్ణ, సంజీవ్, శివకృష్ణప్రసాద్, ఉదరు తదితరులు సీఎమ్‌డీ ప్రభాకరరావును ఘనంగా సన్మానించారు. శాలువా కప్పి, భారతదేశ చిత్రపటం పక్కనే ప్రభాకరరావు నిలువెత్తు ఫోటో ఉన్న జ్ఞాపికను బహూకరించారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు ఆయన విద్యుత్‌రంగానికి చేసిన సేవలు, 24 గంటల విద్యుత్ సరఫరా సహా పలు అంశాలను వారు ప్రస్తావించారు. విద్యుత్ పంపిణీ సంస్థల సీఎమ్డీలను సమన్వయం చేసుకుంటూ ప్రభాకరరావు చూపిన చొరవను కొనియాడారు. ఎంప్లాయీ ఫ్రెండ్లీగా ఆయన అందరికీ పెద్దదిక్కుగా నిలిచారని చెప్పారు. విద్యుత్ ఉద్యోగులు అందరికీ పాత పెన్షన్ అమలు చేయాలని ఈ సందర్భంగా వారు ప్రభాకరరావుకు విజ్ఞప్తి చేశారు. దీనిపై ఆయన స్పందిస్తూ 1999 నుంచి ఇప్పటి వరకు పనిచేస్తున్న ఉద్యోగులకు పాత పెన్షన్ సౌకర్యం కల్పించే విషయాన్ని సాధ్యమైనంత త్వరగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.