Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రమాణం చేయించిన సీజే
- 34కి పెరిగిన జడ్జీల సంఖ్య.. మరో 8 పోస్టులు ఖాళీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
న్యాయవాదుల కోటా నుంచి హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తులు నియమితులయ్యారు. వారితో మంగళవారం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ మొదటి కోర్టు హాల్లో ప్రమాణస్వీకారం చేయించారు. న్యాయమూర్తులుగా ఏనుగుల వెంకట వేణుగోపాల్, నగేష్ భీమపాక, పుల్లా కార్తీక్ (పి.యలమాధర్), కాజ శరత్, అదనపు న్యాయమూర్తులుగా జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్‌రావు ప్రమాణం చేశారు. ఆ తర్వాత సీనియర్ న్యాయమూర్తులతో కలిసి ద్విసభ్య ధర్మాసనాల్లో కూర్చుని కేసులను విచారించారు. కొత్తవారు ఆరుగురిలో ఇద్దరు భద్రాచలం, ముగ్గురు పూర్వపు కరీంనగర్ జిల్లా చెందిన వారు కాగా ఒకరు మహబూబాబాద్‌కు చెందినవారున్నారు. వీరి రాకతో హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 28 నుంచి 34కి పెరిగింది. మొత్తం పది మంది మహిళలు న్యాయమూర్తులుగా ఉన్నారు. మొత్తం 42 న్యాయమూర్తుల పోస్టులకుగానూ ఇంకా 8 పోస్టులు ఖాళీగా ఉంటాయి.