Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
మీడియా అకాడమీ భవన నిర్మాణం పనులను ఆర్అండ్బీ శాఖ త్వరగా పూర్తిచేసే.్త వచ్చే దసరా రోజున ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని అకాడమీ చైర్మెన్ అల్లం నారాయణ అన్నారు. 2015లో రాష్ట్ర ముఖ్యమంత్రి మీడియా అకాడమీని సందర్శించినప్పుడు కొత్త భవనం నిర్మిచుకోవడానికి అప్పట్లో రూ. 15 కోట్లు మంజూరు చేశారన్నారు. తాను ఇటీవల సీఎంను మర్యాద పూర్వకంగా కలిసినప్పుడు భవన నిర్మాణ పురోగతి గురించి వివరించాననీ, వచ్చే దసరాకు సెక్రటేరియట్ , అమరవీరుల స్థూపంతోపాటు , మీడియా అకాడమీ భవనం కూడా ప్రారంభించాలని తాను చేసిన విజ్ఞప్తికి సీఎం సానుకూలంగా స్పందించారని వివరించారు. కరోనాకాలంలో నిర్మాణ పనులు కొంత కుంటుబడ్డ మళ్లీ పనులను వేగవంతం చేశామని ఆయన తెలియజేశారు. నాంపల్లిలోని అకాడమీ భవన నిర్మాణ పురోగతిని ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్‌తో చైర్మెన్ సమీక్షించారు. అనంతరం ఆర్ అండ్ బీ అధికారులు భవనాన్ని సెప్టెంబర్ ఆఖరు తేదీలోపు పూర్తి చేసి అప్పగించేందుకు ప్రయత్నిస్తామని హామీ ఇచ్చారు. అకాడమీ నూతన భవనంలో ఒక ఆడిటోరియం, రెండు తరగతి గదులు , లైబ్రరీ ఉంటాయనీ, గ్రామీణ, డెస్క్ విలేకరులకు కోసం ఒక బ్రిడ్జ్ కోర్స్ రూపొందించి సర్టిఫికెట్ కోర్స్ ప్రారంభిస్తామని తెలిపారు. భవన నిర్మాణ పనుల పరిశీలన దానిపై జరిపిన సమీక్షలో అకాడమీ కార్యదర్శి నాగులపల్లి వెంకటేశ్వరరావు, ఆర్ అండ్ బీ ఇంజినీర్లు మహమ్మద్ హాఫీజ్, ఎస్ఈ నర్సింగ్ రావు, ఈ ఈ మాధవి, డిప్యూటీ ఇంజినీర్ నితిన్ తదితరులు పాల్గొన్నారు.