Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విమల్‌కుమార్ మరణం పట్ల సంతాపం
- రూ.10 లక్షల ఆర్థిక సహాయం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రైతుల పట్ల తన అభిమానాన్ని, ప్రేమని మరోసారి చాటుకున్నారు. మరణించిన రైతు కుటుంబానికి అండగా నిలిచారు. కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శంచడానికి ఇటీవల జాతీయ రైతు సంఘం కార్యకర్త విమల్ కుమార్ వచ్చారు. పర్యటన అనంతరం హైదరాబాద్‌లో ఆయన గుండెపోటుతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న ముఖ్య మంత్రి కేసీఆర్ ఆయన మరణం పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన కుటుంబానికి రూ.పది లక్షల ఆర్థిక సహాయం ప్రకటించారు. జాతీయ రైతు సమాఖ్య కర్ణాటక అధ్యక్షులు శాంత కుమార్ అధ్యక్షతన మైసూరులో మంగళవారం ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ రైతు బంధు సమితి అధ్యక్షులు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చేతుల మీదుగా ఆయన కుటుంబానికి సాయం చేరేలా చేశారు. ఈ సందర్భంగా రాజేశ్వర్‌రెడ్డి మాట్లా డుతూ తెలంగాణలోని రైతాంగానికి ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు, రైతుభీమా, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి పథకాలు రైతులకు ఉపయోగపడు తున్నాయని చెప్పారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మారుస్తున్నాయని వివరించారు. తెలంగాణ పథకాల గురించి తెలుసుకున్న కర్ణాటక రైతాంగం అక్కడా ఇటువంటి పథకాలు కావాలనీ, వాటిని అమలు చేస్తే బావుంటుందంటూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అనంతరం రూ.పది లక్షల చెక్కును విమల్ కుమార్ కుటుంబ సభ్యులకు అందించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ భారత రైతు సంఘాల అధ్యక్షులు కోటపాటి నరసింహ నాయుడు, తెలంగాణ రైతు బంధు సమితి ఖమ్మం జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు, చేతన్ తదితరులు పాల్గొన్నారు.