Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తన కొడుకు కేటీఆర్ ఇక ఎప్పటికీ సీఎం కాలేడన్న ఒత్తిడిలో కేసీఆర్ ఉన్నారనీ, తన అధికారం కోల్పోతున్నానన్న తీవ్ర ఆందోళనలో ఆయన ఉన్నాడని కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మాజీ ప్రధాని వాజ్పేయి వర్ధంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాజ్పేయి చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. బండి సంజరు పాదయాత్రపై టీఆర్ఎస్ శ్రేణుల దాడిని తీవ్రంగా ఖండించారు. గవర్నర్ను రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అవమానిస్తున్నదని విమర్శించారు. గవర్నర్ పర్యటనలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోటోకాల్ పాటించపోవటం రాజ్యాంగ విరుద్ధమన్నారు. తెలంగాణకు ఏం చేయలేని కేసీఆర్ దేశాన్ని ఎలా ఉద్దరిస్తాడని ప్రశ్నించారు. ఇంజినీర్ల సూచనలను పక్కనపెట్టి సొంత ఆలోచనతో సాగునీటి ప్రాజక్టులను కేసీఆర్ నిర్మించారని విమర్శించారు. బీజేపీలో చేరుతున్న వారిపై కేసీఆర్ ప్రభుత్వం దాడులు చేయిస్తున్నదని ఆరోపించారు.