Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన గవర్నర్
నవతెలంగాణ-హైదరాబాద్బ్యూరో
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, నేషనల్ హెడ్ క్వార్టర్స్, న్యూడిల్లీ సహకారంతో నాలుగు మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లను రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆరోగ్యవంతులు ప్రతి ఒక్కరు రక్త దానం చేసి, ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ఈ మొబైల్ బ్లడ్ కలెక్షన్ వ్యాన్లు రక్తదాతల దగ్గరికే వెళ్ళి రక్తాన్ని సేకరించడానికి ఎంతగానో ఉపయోగపడతాయనీ, దీనివల్ల రక్తదాతలు కూడా ముందుకు వస్తారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వ్యాన్లను హన్మకొండ, హైదరాబాద్, కరీంనగర్, నిజామాబాద్ రెడ్ క్రాస్ ప్రతినిధులకు అందించారు. కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ రెడ్ క్రాస్ ఛైర్మెన్ అజరు మిశ్రా, గవర్నర్ కార్యదర్శి కె. సురేంద్ర మోహన్ పాల్గొన్నారు.