Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కాలేజీల్లో చేరేందుకు నేటి వరకు గడువు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2022-23 విద్యాసంవత్సరంలో పాలిటెక్నిక్, డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పాలిసెట్)లో స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియలో భాగంగా 564 మంది అభ్యర్థులకు సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు పాలిసెట్ ప్రవేశాల కన్వీనర్, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్‌మిట్టల్ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్ల భర్తీకి స్పాట్ అడ్మిషన్లను చేపట్టామని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు 493 మంది, అర్హత కాని అభ్యర్థులు 158 మంది కలిపి 651 మంది అభ్యర్థులు వెబ్ఆప్షన్లు నమోదు చేశారని వివరించారు. వారిలో 564 మందికి సీట్లు కేటాయించామని తెలిపారు. సీట్లు పొందిన అభ్యర్థులు https://tspolycet.nic.in వెబ్సైట్ ద్వారా సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయాలని సూచించారు. కాలేజీల్లో చేరేందుకు బుధవారం వరకు గడువుందని స్పష్టం చేశారు. ఒకవేళ సెల్ఫ్‌రిపోర్టింగ్ చేయకుంటే సీట్లు రద్దవుతాయని పేర్కొన్నారు. బుధవారం నుంచే పాలిటెక్నిక్ కాలేజీల్లో తరగతులు ప్రారంభమవుతాయని వివరించారు.