Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హుజూర్నగర్/ కోదాడరూరల్
సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు విద్యుత్ ఏఈ గోవిందరాజు మంగళవారం లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. ఏసీపీ డీఎస్పీ కృష్ణగౌడ్ తెలిపిన వివరాల ప్రకారం..
మేళ్లచెర్వు మండలంలో కాంట్రాక్టర్ తిరుపతమ్మ, రాజేశ్ అక్కా తమ్ముడు. ఇద్దరూ కలిసి ఉమ్మడి కాంట్రాక్టు పనులు చేస్తున్నారు. విద్యుత్ పనులకు సంబంధించి వారి నుంచి ఏఈ గోవిందరాజు రూ.53వేలు లంచం డిమాండ్ చేశాడు. ఇందులో భాగంగా మొదటి విడతగా రూ.25వేలు ఇచ్చారు. మిగతా రూ.28వేలు ఇవ్వడానికి ముందు వారు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఏసీబీ అధికారులు ఇచ్చిన నోట్లను వారు తీసుకుపోయి మంగళవారం కోదాడ పట్టణంలోని గోపిరెడ్డినగర్లో ఏఈ ఇంటి వద్ద ఉన్న ఆయన కారులో పెట్టారు. అనంతరం ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతరం ఏఈని హుజూర్నగర్ విద్యుత్ డీఈ కార్యాలయానికి తీసుకెళ్లి విచారించారు.