Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్అందజేత
హైదరాబాద్: ఆర్థిక సాయాన్ని అందుకున్న విద్యార్థులు కష్టపడి రాణించాలని దాతలు కోరారు. శ్రీ కల్లప సత్రం టుబాకో బజార్ (సికింద్రాబాద్) ఎం సత్య చంద్రారెడ్డి కార్యనిర్వహణ అధికారి ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలకు చెందిన మెరిట్ స్టూడెంట్స్ ప్రభుత్వ పాఠశాల హిల్ స్ట్రీట్ లో స్కాలర్ షిప్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కమిషనర్ దేవదాయ శాఖ సహాయ కమిషనర్ (సికింద్రాబాద్) బి కష్ణ హాజరయ్యారు. జూనియర్ అసిస్టెంట్ బి జలంధర్ రెడ్డి, జి చంద్రశేఖర్, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.