Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో లా కోర్సుల్లో 2022-23 విద్యాసంవత్స రంలో ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్ రాతపరీక్షల ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3.30 గంటలకు హైదరాబాద్‌లోని మాసబ్‌ట్యాంక్‌లో ఉన్నత విద్యామండలి చైర్మెన్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మెన్ వి వెంకటరమణ, కార్యదర్శి ఎన్ శ్రీనివాసరావు, ఓయూ వీసీ డి రవీందర్, లాసెట్ కన్వీనర్ జిబి రెడ్డి విడుదల చేస్తారు. గతనెల 21,22 తేదీల్లో లాసెట్ రాతపరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. లాసెట్‌కు 35,538 మంది అభ్యర్థులు దరఖాస్తు చేయగా, 28,921 (82.46 శాతం) మంది పరీక్ష రాశారు. ఇందులో మూడేండ్ల లా కోర్సుకు 24,938 మంది దరఖాస్తు చేస్తే 20,107 (80.6 శాతం) మంది హాజరయ్యారు. ఐదేండ్ల లా కోర్సుకు 7,506 మంది దరఖాస్తు చేయగా, 6,207 (82.6 శాతం) మంది, ఎల్ఎల్ఎంకు 3,094 మంది దరఖాస్తు చేస్తే, 2,607 (84.2 శాతం) మంది పష రాశారు. ఇప్పటికే ప్రాథమిక కీని విడుదలైన విషయం తెలిసిందే.