Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కండువాకప్పి ఆహ్వానించిన మంత్రి జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలోని కాంగ్రెస్ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు టీఆర్ఎస్ పార్టీలోకి వలస బాట పడుతున్నారు. మంగళవారం హైదరాబాద్‌లో మంత్రి జగదీశ్‌రెడ్డి నాంపల్లి మండలానికి చెందిన పెద్దపురం, దేవత్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలకు టీఆర్ఎస్ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జి. కిశోర్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి జెడ్పీ చైర్మెన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.