Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పరకాల పట్టణంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాచం గురు ప్రసాద్ పై పరకాల శాసనసభ్యులు ధర్మారెడ్డి ప్రోత్సాహంతో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడిని ఖండిస్తూ బుధవారం పరకాల బంద్కు పిలుపునిచ్చినట్టు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. బంద్ ను శాంతియుతంగా భారతీయ జనతా పార్టీ నిర్వహిస్తుందనీ, ప్రజలు సహకరించాలని కోరారు.