Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మూడ్రోజుల పాటు నిర్వహణ
- పాల్గొననున్న 500 మంది కవులు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బహత్ బాలకవి సమ్మేళనం మంగళవారం హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో గల తెలంగాణ సారస్వత పరిషత్‌లో ప్రారంభమైంది. మూడ్రోజుల పాటు ఇది జరుగుతుంది. ఇందులో 500 మంది బాల కవులు పాల్గొననున్నారు. బాల కవి సమ్మేళనంలో ఇప్పటిదాకా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి 130 మంది విద్యార్థులు పాల్గొని తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, కన్నడ భాషల్లో దేశభక్తియుక్త కవితలు చదివి వినిపించారు. ఖమ్మం జిల్లాకు చెందిన షేక్ రిజ్వానా పదో తరగతిలోనే తెలుగులో రిజ్జూ శతకం రాసినందుకు ఆ చిన్నారిని అభినందిస్తూ మూడు రోజుల కవిసమ్మేళనాన్ని ఆమెతోనే ప్రారంభించారు. ప్రారంభ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్ ఆచారి, ఉపాధ్యక్షులు మంచాల వరలక్ష్మి, గుండం మోహన్ రెడ్డి, సాహిత్య విభాగం కన్వీనర్ కాంచనపల్లి, సమన్వయ కర్త ఘణపురం దేవేందర్, హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు అనంతుల ప్రశాంత్, జాగృతి రాష్ట్ర నాయకులు కుమారస్వామి, రాష్ట్ర కార్యదర్శి విక్రాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.