Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోదండరాంకు టీపీసీసీ విజ్ఞప్తి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలంటూ టీజేఎస్ అధ్యక్షులు కోదండరాంను టీపీసీసీ కోరింది. ఈమేరకు మంగళవారం టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో కోదండరాంను కాంగ్రెెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, ఉపాధ్యక్షులు మల్లు రవి కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులు, ఉప ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ పార్టీలో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో పార్టీ నేతలు వేం నరేందర్‌రెడ్డి, ఈరవర్తి అనిల్, విజయ రమణారావు తదితరులు ఉన్నారు.