Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-సిద్దిపేట అర్బన్
కేంద్రంలో మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నినాదాలకే సరిపోయిందని, పథకాల అమలు శూన్యంగా ఉందని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శివానుభవ మండపంలో సీపీఐ జిల్లా 3వ మహాసభలకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 75 ఏండ్ల స్వాతంత్య్రం సందర్భంగా వేడుకలు నిర్వహిస్తున్నా దేశంలో పేదరికం అలాగే ఉందని, స్వాతంత్య్ర సమర యోధులు కలలుగన్న రాజ్యం రాలేదని తెలిపారు. మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను, వ్యవసాయ, విద్యుత్ రంగాన్ని ప్రయివేటుపరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. సంక్షేమ పథకాలు, సబ్సిడీలను పేదల నుంచి దూరం చేయడానికే మోడీ ఉచిత పథకాలు వద్దంటున్నారని ఆరోపించారు. వాటిని రద్దు చేస్తే రైతులు, నిరు పేదల ఆత్మహత్యలు పెరుగుతాయన్నారు. అదానీ, అంబానీలకు మోడీ రూ.12 లక్షల కోట్లు రుణమాఫీ చేశాడన్నారు. మోడీ ప్రభుత్వంలో మతోన్మాదం, నియంతృత్వం పెరిగిపోతోందని విమర్శించారు. ధరణి పోర్టల్లో ఉన్న లొసుగులు ఏ పథకంలో లేవని, దాన్ని వెంటనే ప్రక్షాళన చేయాలని ప్రభు త్వానికి సూచించారు. ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మును గోడులో 5సార్లు సీపీఐ ఎమ్మెల్యే అలయన్స్లో గెలిచారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ ఓటమే లక్ష్యంగా పని చేస్తామని, దానికోసం ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే విషయమై కిందిస్థాయి కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుం టామని చెప్పారు. రాజగోపాల్రెడ్డి స్వార్దం వల్లనే ఉప ఎన్నిక వచ్చిం దన్నారు. ఈ నెల 19, 20వ తేదీల్లో జరిగే రాష్ట్ర కమిటీ సమావేశంలో చర్చించి భవిష్యత్ ప్రణాళిక ప్రకటిస్తామని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై మిలిటెంట్ పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. అనంతరం మహాసభల సందర్భంగా సీపీిఐ జెండాను ఆవిష్కరించారు. కార్య క్రమంలో సీపీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి మంద పవన్, నాయకులు వెంకట్ రామ్ రెడ్డి, బన్సీలాల్, లక్ష్మణ్, శంకర్, మన్నేకుమార్ తదితరులు పాల్గొన్నారు.