Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్
- షార్ట్‌ఫిలిం యూనిట్లకు సన్మానం
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఆర్టీసీ సేవల్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లేందుకు షార్ట్ఫిలిమ్స్ దోహదపడతాయని టీఎస్ఆర్టీసీ చైర్మెన్ బాజిరెడ్డి గోవర్థన్ అన్నారు. కేవలం రెండు నిముషాల్లో ప్రజా రవాణా వ్యవస్థలో ఆర్టీసీ అందిస్తున్న సేవల్ని ్ల కండ్లకు కట్టినట్లు చిత్రీకరించారని కొనియాడారు. టీఎస్ఆర్టీసీ నిర్వహించిన షార్ట్ ఫిలిం కాంటెస్ట్ -2022లో విజేతలుగా నిలిచిన వారికి బుధవారంనాడాయన మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్‌తో కలిసి బస్‌భవన్‌లో నగదు బహుమతులు అందజేశారు. తక్కువ టైంలో 60కి పైగా లఘు చిత్రాల ఎంట్రీలు వచ్చాయని తెలిపారు. సంస్థ అందిస్తున్న రాయితీలతో సహా అన్ని రకాల సేవల్ని రెండు నిముషాల నిడివిలో చూపించడం ఆయా చిత్రాల యూనిట్ల ప్రతిభ అని ప్రసంసించారు. టీఎస్ఆర్టీసీతో ప్రతి పౌరుడికి అనుబంధం ఉంటుందనీ , మారుమూల ప్రాంతాలకు సైతం సేవలు అందిస్తున్న సంస్థను మరింత ఆదరించ డానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సంస్థ చీఫ్ ఆవరేటింగ్ ఆఫీసర్ డా. రవీందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఇ) వినోద్, సి.టి.ఎం (మార్కెటింగ్ అండ్ కమర్షియల్) కష్ణకాంత్, చీఫ్ మేనేజర్ (ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ ) శ్రీమతి విజయ పుష్ప, జ్యూరీ సభ్యులు శ్రీమతి అరుణ రవికుమార్, సీ శాంతికుమార్, అభినరు దేశ్ పాండే పాల్గొన్నారు .
విజేతలు వీరే...
షార్ట్ ఫిలిం కాంటెస్ట్ - 2022 లో మొత్తం 61 ఎంట్రీలు వచ్చాయి. ఇందులోంచి ముగ్గురు జ్యూరీమెంబర్స్ ఎంపిక చేసిన వాటిలో ఉత్తమంగా ప్రథమ విభాగంలో రాము మొగిలోజి (రూ.10వేలు ), ద్వితీయ విభాగంలో రామ్సర్ధార్ (రూ.5వేలు) , తతీయ విభాగంలో సంజీవ్ చిన్నకొట్ల (రూ.2,500 )కు నగదు బహుమతి, ప్రశంసా పత్రం, శాలువాతో సత్కరించారు .కన్సోలేషన్ విభాగంలో 13 మందికి రూ.వెయ్యి చొప్పున అందజేశారు. మిగిలిన వారికి కూడా ప్రశంసా పత్రాలు అందజేసి ప్రోత్సహించారు. షార్ట్ట్ ఫిలిం కాంటెస్టుకు రూపకల్పన చేసిన సాయి తేజ,రాజశేఖర్‌లను ప్రత్యేకంగా అభినందించారు.