Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎల్బీ స్టేడియంలో సభ.. హాజరుకానున్న సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
స్వతంత్ర భారత వజ్రోత్సవ ముగింపు వేడుకలను ఈనెల 22న ఘనంగా నిర్వహించనున్నారు. అదే రోజు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించబోయే సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వజ్రోత్సవ వేడుకల కమిటీ చైర్మెన్, ఎంపీ కే.కేశవరావు బుధవారం మీడియాకు వెల్లడించారు. హైదరాబాద్లోని బీఆర్కే భవన్లో కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేకే మాట్లాడుతూ... ఈనెల ఎనిమిదో తేదీన ప్రారంభించిన వజ్రోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయని అన్నారు. వీటిని జయప్రదం చేస్తున్న ప్రజా ప్రతినిధులు, అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు. 22న ఎల్డీ స్టేడియంలో నిర్వహించే సభలో శంకర్ మహదేవన్, శివమణి డ్రమ్స్, దీపికా రెడ్డి బృందంతో నృత్యం, తెలంగాణ జానపద కార్యక్రమాలు, లేజర్ షోలు ఉంటాయని వివరించారు. ముగింపు సభకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల మంది హాజరవుతారని కేకే ఈ సందర్భంగా తెలిపారు.