Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం కేసీఆర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ తెలంగాణ వీరత్వానికి, పరాక్రమానికి ప్రతీక అని సీఎం కేసీఆర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సబ్బండ వర్గాల ఆత్మగౌరవ స్ఫూర్తిగా నిలిచిన ఆయన వీరగాధను గురువారం పాపన్న జయంతి సందర్భంగా సీఎం స్మరించుకున్నారు. ఆనాటి సమాజంలో నెలకొన్న నిరంకుశ రాచరిక పోకడలకు వ్యతిరేకంగా సబ్బండ వర్గాలను ఏకం చేసి, పాపన్న పోరాడిన తీరు గొప్పదని తెలిపారు. పాపన్న గౌడ్ జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ.. బడుగు, బలహీనవర్గాల నాయకత్వాన్ని సముచితంగా గౌరవించుకుంటున్నదని వివరించా రు. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా పాపన్న గౌడ్ ప్రదర్శించిన ఆత్మగౌరవ పోరాట స్ఫూర్తిని తెలంగాణ కొనసాగిస్తుందని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటమే..
సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ 372వ జయంతి సందర్భంగా చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ, తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో పాపన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేతివృత్తిదారు ల సమన్వయ కమిటీ కన్వీనర్ ఎంవీ రమణ మాట్లాడుతూ ఆధిపత్యానికి వ్యతిరేకంగా బలహీను లను కూడగట్టిన పాపన్న మతసామరస్యానికి ప్రతీకగా సైన్యాన్ని నిర్మించారని చెప్పారు. ఆయన పోరాటమంతా ఆధిపత్య వర్గాలకు వ్యతిరేకంగా జరిగిందన్నారు. తెలంగాణ ప్రజా సంస్కతిక కేంద్రం బాధ్యులు భూపతి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గోల్కొండ ఖిల్లా పై బహుజన పతాకాన్ని ఎగరవేయటమే లక్ష్యంగా పాపన్న కడవరకు పోరాడారని తెలిపారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ళ ఆశయ్య మాట్లాడుతూ.. పాపన్నకు కొంత మంది మతోన్మాదు లు మతం, కులం రంగు పులుముతున్నారని ఆందో ళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాగ్గేయకా రుడు జయరాజ్, సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి, గౌడకల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ అయిలీ వెంకన్న గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలికట్టే విజరు కుమార్ గౌడ్ ,గడ్డమీది విజరు కుమార్ గౌడ్ ,హర్షవర్ధన్, కల్లు గీత కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షలు ఉషాగౌని వెంకట్ నర్సయ్య ,రంగారెడ్డి జిల్లా కార్యదర్శి బోయపల్లి సుధాకర్ ,,రాష్ట్ర సోషల్ మీడియా కన్వీనర్ సురుగు రాజేష్ , ఉదరు గౌడ్ పాల్గొన్నారు.
ఆయన బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు
- మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
తెలంగాణ తొలిరాజు, బహుజన రాజ్యాధికార పోరాట యోధుడు మొగలాయి దౌర్జన్యాలను ఎదురించి,తెలంగాణ ప్రాంతాన్ని కాపాడిన గొప్ప వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా గురువారం హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో పాపన్న సేవలు స్మరించుకుని ఆయన చిత్రపటానికి మంత్రి పుష్పాంజలి ఘటించారు. నివాళులు అర్పించిన వారిలో టీిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి తదితరులు ఉన్నారు.